పుట:Andhrulacharitramu-part3.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీర్చుకొనుడు. ఇదియే నా కోరిక" అని చెప్పి ప్రాణములు విడిచెనట! ఇట్లని వెలుగోటి వారి వంశచరిత్రమునందు వ్రాయబడినది. కాని సింగమనాయని మరణము మఱియొక విధముగా దెలియుచున్నది. పూసపాటి రాజన్యుల పూర్వికుడగు మాధవవర్మకును రేచర్ల గోత్రోద్భవుడగు సింగమనాయనికిని బెజవాడ సమీపమున నున్న పెదవీడను స్థలమున ఘోరమైన యుద్ధము జరిగి యా యుద్ధములో మాధవవర్మ సింగమనాయని సంహరించుటయె గాక యంతటితో దృప్తి నొందక సింగమనాయని భార్య గర్భములో నుండు శిశువుం గూడ సంహరింప బ్రయత్నించెనట! అందువలన నాతనికి "రేచెర్ల గోత్రసముద్భవశుష్కకాననదాపదహను" డను బిరుదము కలిగెనని కవిజీవితములలో బేర్కొనబడియెను[1]. సింగమనాయని మరణమునకు బైని జెప్పిన వానిలో నేది కారణమైనను సింగమనాయని పుత్త్రులకు రాచవారియెడ ద్వేషమును బురికొల్పుటకు జాలియుండెను.

  1. శ్రీరామమూర్తి కృతమగు కవిజీవితగ్రంథము పే.34 రేచర్ల గోత్రజులలో సింగమనామధేయులును, పూసపాటివారి వంశములో మాధవవర్మ నామధేయులును పెక్కండ్రు గలరు గావున నెవరి కాలమున నిట్టిపని జరిగియుండునని చదువరులకు సంషయము గలుగవచ్చును. ఈ కారణము చేతనే పూసపాటివారికి పై బిరుదము వచ్చియున్న యెడల తప్పక ఈ సింగమనాయనికాలమే యై యుండవలయును. అయిననింకను విచారణీయము.