పుట:Andhrulacharitramu-part3.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనెగొందిపై తురుష్కుల దండయాత్ర

సంగమ రాజపుత్త్రులు నూత్నకర్ణాటరాజ్యమును స్థాపించుటకుఁ బూర్వమనగా క్రీ.శ. 1333 వ సంవత్సరప్రాంతమున చంద్రవంశసంజాతుఁడగు జంబుకేశ్వరుఁడు తుంగభద్రానదికి[1]

  1. చేసెనఁట! విష్ణువర్ధనుఁ డనుమూఁడవవానిం గూర్చి యేమియుం దెలియరాదు. విజయధ్వజుడే తుంగభద్రాతీరమునఁ దనపేరిట విజయనగరమనుపట్టణమును నిర్మింపగా దానిని మాధవవిద్యారణ్యులవారి ప్రోత్సాహముచే సంగమరాజపుత్త్రుఁడగు హరిహరరాయ లతివిశాలమైన పట్టణముగాఁ జేసి ప్రఖ్యాతికిఁ దెచ్చెనని కొందఱు వ్రాసి యున్నారు. విజయధ్వజుని యనంతరమున వేమరాజు 1176 వఱకును, మునిమనుమఁడగు రామదేవరాజు 1271 వఱకును, రామదేవరాయని కుమారుఁ డగు ప్రతాపరాయఁడు 1297 వఱకును ప్రభుత్వము చేసిరఁట. ఈ ప్రతాపరాయని కొడుకే జంబుకేశ్వరరాయలఁట! ఈ రాయవంశావళి క్రమమైనదియగునో కాదో పరిశోధింపవలసిన గ్రంథముగా నున్నది. ఈ వంశావళిలో విజయధ్వజుడంటే ఇప్పటి విజయనగర సంస్థానీకులైన మాసపాటివారి పూర్వికుఁ డని విజయనగరకళాశాలాధ్యక్షులగు శ్రీమాన్ కిళాంబిరామానుజాచార్యులు ఎమ్.ఏ.బి.ఎల్.ఎఫ్.ఎమ్.యు గారాంధ్రపత్రిక యొక్క మూఁడవ సంవత్సరాది సంచికలో విజయనగరపురాజు లను శీర్షికతో వ్రాసిన వ్యాసములో నుదాహరించి ముడిపెట్టినది మాత్రము వింతగా గవ్వట్టక మానదు. రాయవంశావళి గ్రంధుములోని పై వరుసక్రమమును శ్రీయుత బెంగుళూరు సూర్యనారాయణరావు బి.ఏ గారి Never-To-Be-Forgotten-Empire అను గ్రంథమునుండి గ్రహింపఁబడినది