పుట:Andhrula Charitramu Part 2.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనంతతీర్థులని మొట్టమొదట నామకరణము చేసిరి. ఇతడు శాలివాహన శకము 1121కి సరియైన క్రీ.శ.1199వ సంవత్సరమున దక్షిణ కన్నడములోని యుడిపి గ్రామమున జనించెను. ఇతని గురువు పేరు అచ్చుతప్రేక్షుడు. తల్లిపేరు వేదవేది. తండ్రిపేరు మధ్యగేహభట్టు. ఇతడును శంకరరామానుజుల వలెనే ప్రస్థానత్రయమునకు భాష్యములను వ్రాసి ప్రసిద్ధికెక్కెను. జీవేశ్వరులకైక్యమెన్నడును లేదని యితని సిద్ధాంతమైయున్నది. దీనినే ద్వైతసిద్ధాంతమందురు. ఇది శంకరాచార్యుని యద్వైతమతమునకు విరుద్ధమయినది. ఈ మతసాంప్రదాయికులు ద్వైతులనియు, మాధ్వులనియు బేర్కొనబడుచున్నారు. ఉడిపి గ్రామమున వీరికి ప్రదానాచార్య పీఠముగలదు. కర్ణాటకమునందీ మతప్రచారమెక్కువగా నున్నదని చెప్పుదురు. ఈ మతకర్త ప్రస్థానత్రయమునకు భాష్యములను మాత్రమేగాక యనేక ద్వైతమత గ్రంథములనుగూడ విరచించెను.