పుట:Andhrula Charitramu Part 2.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యాధ్యక్షుడగు బొమ్మరాజునెదుర్కొని యాతని గదనరంగమున నోడించి బిజ్జలునియొద్దనుండి గైకొన్న రాజ్యమునాక్రమించుకొనియెను. అటుపిమ్మట శాణదేశమును బాలించుచుండిన భిల్లముడను యాదవరాజు విజృంభించి శాలివాహన శకము 1109 అనగా క్రీ.శ.1187వ సంవత్సరముననంశల భూమీశునిదగు శ్రీవర్ధనమను పట్టణమును ముట్టడించి ప్రత్యండకరాజును భండనముననుక్కడించి, మంగళవేష్టకరాజగు వజ్రుని జిక్కాడి, కళ్యాణరాజ్యమునాక్రమించు హోసలయాదవుని ముందునకు జరగిరానీక హద్దునియమించి, కృష్ణానదికి ఉత్తరభాగమునంతయు నాక్రమించుకొని, దేవగిరిని రాజధానికగ జేసికొని, పరిపాలనము చేయసాగెను. కుంతలము అనగా దక్షిణ మహారాష్ట్రమును కర్ణాటమును విష్ణువర్ధనుని మనుమడు వీరబల్లాలరాజు పరిపాలనము చేయుచుండెను. త్రిలింగరాజ్యమును మొదటి ప్రతాపరుద్రుడు విస్తరింప జేయుచుండెను. కళింగ గాంగజవంశజులుత్కల రాజ్యమును గాంగనదివరకు వ్యాపింపజేయుచుండిరి. వేగిదేశ మంతయు పేరికి మాత్రము చోడచక్రవర్తులకు లోబడియున్నను అనేక మండలములుగా విభాగింపబడి మహామండలేశ్వరులయిన తెలుగు చోడులచేతను, పల్లవులచేతను, చాళుక్యులచేతను, బరిపాలింపబడుచుండి తుదకు కాకతీయాంధ్రసామ్రాజ్యమునకు వశమైపోయెను. పండ్రెండవ శతాబ్దాంతమునందు దక్షిణ హిందూస్థానమున నేకచ్ఛత్రాధిపత్యమును వహింపవలయునని పై మూడు సామ్రాజ్యముల వారును బోరాడుచునేయుండిరి. పండ్రెండవ శతాబ్దస్థితి సంగ్రహముగా దెలిపితిమి గావున, నీ శతాబ్దమునందు మహామండలేశ్వరులుగనుండి కృష్ణానది మొదలుకొని కాంచీపురము వరకు బరిపాలించిన తెలుగు చోడ రాజుల వంశములను గూర్చి రెండవ ప్రకరణమునందు వివరముగా వ్రాయుచున్నాడను.

మధ్వాచార్యులు.

ఈ శతాబ్దమునందే మరియొక సంస్కృతి బయలువెడలెను. ఇతడే ద్వైతమత స్థాపనాచార్యుడగు మధ్వాచార్యుడు. ఈ మతాచార్యుని