పుట:Andhrula Charitramu Part 2.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యనియు, బిజ్జలుడు ద్వారపాలకుడనియు, కళ్యాణమే కైలాసమనియు వీరశైవులు ప్రమథగణంబులనియు దేటపడుచున్నది. [1]

కాలచుర్యవంశము.

బిజ్జలుడు క్రీ.శ.1167వ సంవత్సరమున జంపబడియెను. అప్పటినుండి బిజ్జలుని సంతతివారు 1172వ సంవత్సరము వరకును కళ్యాణపురమును బరిపాలించిరి. బిజ్జలుని తరువాత సోమేశ్వరుడు, సంకాముడు, ఆహవమల్లుడు నను కాలచుర్యరాజులు మూవురు పరిపాలించినట్లు కన్పట్టుచున్నది. శా.శ.1104(క్రీ.శ.1182)వ సంవత్సమున బశ్చిమ చాళుక్య రాజగు నాలుగవ సోమేశ్వరుడు కాలచుర్యులనుండి తన పూర్వులు గోల్పోయిన భాగములను మరల స్వాధీనముగావించుకొనియెను. మరికొన్ని భాగములను దేవగిరి యాదవులును, కాకతీయాంధ్రులును ఆక్రమించుకొనగా బిజ్జలుని వంశమంతరించినది.

చాళుక్య పరిపాలనము.

ఈ నాలుగవ సోమేశ్వరునితో చాళుక్య పరిపాలనముగూడ నడుగంటెను. ఈ చాళుక్య పరిపాలనమునందచ్చటచ్చట కొందరు వైశ్యులు మొదలగువారు బౌద్ధవిహారముల నిర్మించి దానధర్మములు మొదలగునవి చేయుచున్నను, అచ్చటచ్చట బౌద్ధమత సంబంధము లయిన చిహ్నములు గానంబడుచుండినను, బౌద్ధమతము క్షీణించినదనియే చెప్పవచ్చును. వీరశైవమతోద్ధారణతో జైనమత విజృంభణమణగిపోవుటయేగాక, క్రమక్రమముగా క్షీణింపనారంభించెను. వర్తకులు రాజకీయోద్యోగులు వీరశైవమత మవలంబించుట చేత నా మతము వ్యాపించుచుండెను. జైన విగ్రహముల స్థానముల యందు బ్రాహ్మణుల విగ్రహములు ప్రతిష్ఠింపబడుచుండెను. ఈ కాలమునందే దేశము

  1. చెన్నబసవపురాణమును పిడుపర్తి సోమనాధకవి పద్యకావ్యముగా వ్రాసియున్నాడు