పుట:Andhrula Charitramu Part 2.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క మతసాంఘికస్తితి సంపూర్ణముగా మారిపోవుటకు ప్రారంభమైనది. మరల పౌరాణికమతము విజృంభింపనారంభించినది.

పౌరాణికమతము.

నిబంధన గ్రంథములు.

పురాతనమైన దేవతార్చనము వర్థిల్లుచుండెను. న్యాయధర్మ విషయములు పురాణములలోను స్మృతులలోను వెదజల్లబడి చెదరిపోయియుండుట చేతను, పరస్పర విరుద్ధములుగనుండుట చేతను, వానినన్నిటిని క్రోడీకరించి బ్రాహ్మణులును తదభిమానులగు రాజులును నిబంధన గ్రంథములను వ్రాయింప వలసివచ్చెను. న్యాయ ధర్మ శాస్త్ర విషయములయందు బెక్కుక సందేహములుప్పతిల్లుటచేత నిబంధన గ్రంథములత్యావశ్యకము లయినవి. కాబట్ట యీ కాలమునందే యనేక నిబంధన గ్రంథములు వ్రాయబడినవి. ఈ గ్రంథరచన పదునొకండవ శతాబ్దము మొదలు పదునాలుగవ శతాబ్దాంతము వరకు జరుగుచుండెను. ధారేశ్వరుడు, విజ్ఞానేశ్వరుడు, అపరార్కుడు, హేమాద్రి, సాయనుడు మొదలగు నిబంధనగ్రంథకారులెందరో గలరు.


అనంతర రాజకీయ స్థితి.

దక్షిణమున హోసలబల్లాలరాజులును ఉత్తరమున దేవగిరి యాదవ రాజులును, తూర్పున గాకతీయాంధ్రులును బ్రబలియుండుట చేత బశ్చిమ చాళుక్య రాజ్యము, నాల్గవ సోమేశ్వరునితోనే యంతరింప వలసిదయ్యెను. ఈ కాలమునందు హోసలరాజయిన వీరబాల్లాలుడు గాంగవాడి, నలంబవాడి, బనవాసి రాజ్యములనాక్రమించుకొని, పరాక్రమవంతుడై పరిపాలనము సేయుచుండెను. ఇతడు రామానుజుని శిష్యుడగు విష్ణువర్ధనుని మనుమడు. ఈ వీరబల్లాల రాజు కళ్యాణపురముపై దండెత్తివచ్చి నాల్గవ సోమేశ్వరుని