పుట:Andhrula Charitramu Part 2.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దు:ఖించిరి. ఇట్టి పరిభవమును దురుష్కులంతకు బూర్వమొన్నండనుభవించి యుండలేదు.

తురుష్కుల కడపటిదందయాత్ర.

 ఇట్టి పరిభవమును భరియింపజాలక చక్రవర్తి యాగ్రహ మహోదగ్రుడై యెట్లయిన బగదీర్చుకోవలంయునని సంకల్పించి రెందుమాసములలో సైన్యమును సమకూర్పించి ఆలూఫుఖానునే మరల నాంధ్రదేశముమీదికి పంపించెను. ఇంతత్వరలో తురుష్కులు మరలేదాడివెదలివత్తురని యాంధ్రులు తలంచి సిద్ధముగనుండలేదు.  ప్రసిద్ధసేనానాయకులు కొందఱింతవఱకే యుద్ధమున మరణము నొంది యుందుటచేత సైన్యములో క్రొత్తమార్పులను జేయవలసి యుందెను. అట్టిమార్పులు చేసికొనుట కవకాశము లేకపోయినది. కాలము మాఱి వచ్చినప్పు డెవ్వరును జేయునది యుండదు. కాకతీయ సామ్రాజ్యము భగ్నమగుకాలము సంభవించెను. ఈశ్వరాజ్ఞ నెవ్వరు గడవనేర్తురు? కమ్మవారికిని పద్మనాయక వెలమలకును అంత: కలహములు మెండయ్యెను. అయినను నెల్లశాఖలవారును స్వామిభక్తి పరాయణులై యొప్పియుండిరి. మెఱుకులగు తురకలు ధైర్యసాహసములు ముప్పిరి గొన బీదరు(పదర్భాపురము) దుర్గము ముట్టడించిరి. పూర్వమువలెనె యాంధ్రులు మొక్కవోని8 పౌరుషముతో తురుష్కులను మార్కొని ఘోరసంగ్రామమును గావించిరి. మహమ్మదీయులు పెక్కుదినములు ముట్టడిచేసి చలముపట్టి సాధించి గోడ బ్రద్దలుచేసికొనిపోయి 'హుజ్జాహుక్ ఖుజ్జాఖుల్ ' అన్ భీకరధ్వనినెలంగ నాంధ్రవీరులతో బిచాచములరీతి హోరాహొరి బోరాడి యెట్టకేలకు సంకుల సమరంబున బ్రతాపరుద్రునిం బట్టుకొనిరి. అతని విడిపింప పద్మనాయకులు, కమ్మవారు, రెడ్దినాయకులు, రాచవారు ప్రయత్నించి