పుట:Andhrula Charitramu Part 2.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యించినాడని చెప్పిరి. ఈయసత్యవాక్కుకలను విశ్వకరించి యాసేనాధిపతులు తమతమ యనుభవములతో నారాత్రినందు స్కంధావారమున్ విడిచి తొలగిపోయిరి. ఇట్లు తనవారు కొందఱు తన్ను విడిచిపోవుటచేత ఆలూఫ్ ఖాను ముట్టడి మానుకొని దేవగిరికి బాఱిపోయెను. ఆంధ్రుల గుఱ్ఱపుఇదళము వెంబడించివచ్చి పైబడి వేలకొలది శత్రుసైన్యంబుమనఱికివైచెను. ఆలూఫ్ ఖాన్ దేవగిరి చేరిన తరువాత ఢిల్లీసమాచారములను గూర్చిన వదంతులు వట్టివని తెలికొని మిక్కిలి దు:ఖించెను. చెదరిపోయిన సైనికుల జేర్చుకొనుతకు బ్రయత్నించుచుండెను. ఆలూఫుఖాను విడిచిపోయిన మహమ్మదీయ సేనాధిపతులు మార్గమధ్యమున నాంధ్రులచే మార్కొనబడి యనేకులు సంహరింపబడిరి. ఆంధ్రసైనికులు శత్రువుయొక్క యేనుగులను గుఱ్ఱములను, ఒంటెలను సర్వస్వమును సంగ్రహించుకొని పోయిరి. మలిక్ తైమూరు తుగ్గీను అను మహమ్మదీయ సేనాపతు లిరువురు ప్రాణములు గోల్పోయిరి. మొదటి వాడొక యాంధ్రసైన్యాధిపతిచే జెఱబెట్టబడి యాచెఱలో మృతినొందెను. రెందవవాడు నఱికివేయబడియెను. "మల్లిక్ గూల్ ఆఫీఘన్, మల్లిక్ కాపుర్" అను వారలనిరువురను తమసైనికులే చెఱగొని, దేవగిరికి దీసికొని పోయిరి. అప్పుడు వీరలదుష్ట ప్రవర్తనమునుగూర్చి విచారింణజరిగి నేరము చేసిన వారిని కనిపట్టే వారిని ఢిల్లీనగరమునకు పంపించిరి. ఈ యధికారులు ఢిల్లీనగరం ప్రవేశించనతోడనే బాదుషా "పరిహసమునకై బ్రదికియుండగానే నన్ను పాతిపెట్టినారు గనుక బ్రదికియుండగానే వీరిని నేను పాతిపెట్టించుచున్నానని చెప్పి యాయధికారుల నందఱను ప్రాణములతో బాతిపెట్టించెను.

   ఆలూఫుఖాను దేవగిరినుండి ఢిల్లీనగరమును జేరునప్పటికి నతంతోగూడ నున్నది మూడువేల గుఱ్ఱపుదళముమాత్రమే. ఇట్టి మహాపరాధమునకు చక్రవర్తియు, వానితోపాటు మహమ్మదీయ ప్రపంచమున్ మిక్కిలిగ