పుట:Andhrula Charitramu Part 2.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేఱు వేఱు దేశములందు గానంబడుటయె యిందుకు నిదర్శనముగా జెప్ప వచ్చును. రాజకీయాధికారు లెల్లరును శాఖాభేధములచేతను మతభేరముల చేతను వేఱుపడియున్నను చక్రవత్రియాజ్ఞ సుగ్రీవాజ్ఞగా శిరమున వహింప బడుచుందెను. చక్కనిబాట లేర్పడియెను.. వాణీజ్యము విదేశముతోడ దినదిన ప్రవర్ధమానమై యతిశయించుచుండెను. వేయునేల? ఈతనిపాలనమున నాంధ్రుల ప్రతిభావిశేషము విదేశములందు వేనోళ్ల గొనియాడబడుచు ఢిల్లీ చక్రవర్తులకు పక్కలో బల్లెమై నిదుర పుట్టనీయక భయంకరమై యొప్పుచుండెను.

ఇతరప్రసిద్ధ సేవానాయకులు.

    కలియుగవీరభధుడని బిరుదు గాంచిన దేవరినాయనింగారు పల్నాటి యందును సోమయ వెంకయసాహిణింగారు  వెలనాటియందును, కామయ బొప్పనింగారు కమ్మనాటియందును, పోతయసాహిణింగారు సాకనాటి యందును ప్రతాపరుద్రుని కడపటికాలమున నధికారపదవులను వహించి ప్రైసిద్ధికెక్కి యుందిరి. వీరిశాసనము లా యా నాడులలో గనుపట్టుచున్నది.

రాజ్యవిస్తారము.

  తూర్పున సముద్రముహద్దుగా దక్షిణంజున గాంచీపురము జేర్చుకొని యుత్తరమున గళింగదేశములోని సింహాచలపర్యంతమును పశ్చిమంబున గల్యాణకటకమువఱకును ప్రతాపరుద్రుని సమ్రాజ్యము విస్తరించియుండెనని చెప్పవచ్చును. అనగా నిప్పటి నిజాము రాజ్యములోబదింటదొమ్మిదిభాగము లును, విశాఖపట్టణముజిల్లాలోని సింహాచలమునకు దిగువభాగమును, గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, చెంగల్పట్టు, చిత్తూరు, కడప, అనంతపురము జిల్లాలోని యుత్తరభాగం, బళ్లారిజిల్లాలోని పశ్చిమభారము, కందనూలుజిల్లాయును చేరియున్నదని నిస్సంశయముగా జెప్పదగును.