పుట:Andhrula Charitramu Part 2.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాస్త్రమును రచించి యాచక్రవత్రి కంకిరము చేసెను. రుద్రభట్టును మఱియొక విద్వత్కవి సంస్కృత కర్ణాటభాషలయందు బెక్కుగ్రంధములను రచించెను. త్రిపురాంతకకవి సంస్కృతంధ్రముల ననేకగ్రంధములను రచించెను. ఇతదు ప్రేమాభిరామ మను వీధినాటకమును సంస్కృతమున రచింప దానిని శ్రీనధ మహాకవి వల్లభామాత్యునిపేరుతో దెనిగించి క్రీడాభిరామ మని పేరు పెట్టెను. ఈ గ్రంధమునుండి యనేకపద్యముల నుదాహరించియే యున్నాను. ఇతనికాలమున మారనకవి మార్కండేయపురాణమును రచించి యితని మంత్రులలో నొక్కడగు గన్నమంత్రికి నంకితము చేసెను. భాస్కరకవి దశగతులను రామాయణమును రచించి యితని సైన్యాధిపతులలో నొక్కడగు సాహిణిమారుని కంకితము చేసెను. మంచనకవి కేయూరబాహుచరిత్రమును రచించి నండూరిగుండనామాతత్యుని కంకితము చేసెను. శివదేవయ్య యను ప్రధానమంత్రి శివతత్త్వ్గసాయన మను గ్రంధమును రచించెను. ఇంకను శైవులనెకులు శైవగ్రంధములను రిచించి యుండిరి. కావున నీచక్రవర్తి పరిపాలనమున సంస్కతాంధ్రభాషలు రెండును వర్ధిల్లిన వని నిస్సంశయముగా జెప్పవచ్చును.

పరిపాలన వివరణము.

    ఈతని ప్రభుత్వకాలమున నాంధ్రసామ్రాజ్యము రాష్ట్రములుగను, విషయములుగను, దాడులుగను, సీమలుగను విభగింఫబడి నియమితాధి కారూలచే బరిపాలింప బడుచుండెను. ఆకాలమున డెబ్బదిరెండు నియోగములు (Departments) గల వనియు, వానిని విచారించు నధికారులు గలరనియు గంగయ సాహిణింగూర్చి వ్రాయు ప్రకరణమున దెలిపియున్నడను. దానింబట్టియే పరిపాలనము సగడుగా నుండెనని తేటపడాగలదు రాజప్రతినిధులు, మండలాధికారులు, సైన్యాధిపతు లొకచోటనుండి మఱియొక చోటికి మార్పబడిచుండిరని వారిశాసనములు వేఱ్వేఱుకాలముల