పుట:Andhrula Charitramu Part 2.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుద్రుడు తన పరిపాలనములో గావించిన యీమహాపరాధమె యిన్నూఱు సంవత్సరములనుండి వర్ధిల్లిన సామ్రాజ్యమున కాతనితోడనే వినాశము గలిగించినది.

ఏకశిలానగరములోని ప్రసిద్ధదేవాలయములు.

  ఏకశిలానగరములోనున్న ప్రిసిద్ధదేవాలయములను క్రీడాభిరామ మను గ్రంధమున వల్లభమాత్యకవి యీక్రింది సీసపద్యములో చక్కగా బేర్కొని యున్నాడు.

"సీ. అదె భైరవస్థాన మట మీద నల్ల దె
         దమదేశ్వరీ మహాశక్తి నగరు
     వీరభధ్రేశ్వరాగారమంటప మదె
         యదె బౌద్ధదేవు విహారభూమి
    అది ముద్దరా ల్ముసానమ్మ నివాసంబు
        నల్లదే కొమరుసామయ్యనగరు
    అదె పాండవుల గుడి యట దక్షిణంబున
       గర్తారు డుండు తుర్కిఅల మసీదు
గీ. కొంతదవ్వుల నదె మహాగోపురముల
    పైడికుండలు రవిదీప్తి బ్రజ్జ్వరిలింఇ
    కాన నయ్యెను మేరుశృంగముల బోలె
    గేశవశ్రీస్వయంభూనికేతనములు."

       క్రీడాభిరామమును రచించిన కవి ప్రతాపరుద్రుని యనంతరకాలమున నున్నవడు గావున దనకాలమున నున్నతుర్కల మసీదు గూడనిందు బేర్కొనినాడు గాని ప్రతాపరుద్రుని యనంతరమె తురక లేకశిలానగరమున నివసించినవా రగుటచేత నయ్యది ప్రతాపరుద్రునికాలమున లే దని తెలిసి కొనవలయును.  పైని జెప్పింవానిలో కేశవాలయమును శ్రీస్వయంభూ