పుట:Andhrula Charitramu Part 2.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేవాలయమును మిక్కిలి గొప్పదైనటుల గానంబడుచున్నది. శివుని యవతారముగా బరిగణింపబడెడు భైరవునియొక్క పూజ లాకాలమున బాహాటముగా జరుగుచుండెను. భైరవుని యాకృతి వీరభయానకసరముల నుట్టి పడ జేయుచుండెను.

భైరవార్చనము.

    ఈకాలమున భైరవార్చనము శ్రేష్ణ మైనదిగా నెంచబడక పోయినను ఆకాలమున నధికవిశ్వాసముతో భైరవారాధనము సలుపబడుచుండెను. అప్పటి భైరవార్చనంకన్న నంతకు బూర్వముండిన భైరావార్చనము దుర్వినీతితో గూడుకొని యుండెను.  అయిన నీమతము బ్రాహ్మణద్యగ్రవర్ణముల వారిలో నంతగా వ్యాపించియుండలేరు. భక్తులు భక్తిపారవశ్యము చేత ప్రాణము లర్పించు కొని ముక్తి బొందుటయు నప్పటప్పుడు కలుగుచుండెను. గోవిందమంచనశర్మ భైరవాలయంబును బొడగని నమస్కరించి భైరవుని నీక్రిందివిధముగా సంభోచి నట్లు క్రీడాభిరామమున జెప్పబడియెను.

"మ. అమితొత్సాహముతోడ నీవు పటుబాహాఢక్క యొక్కొక్క మా
       టు మన:కంపము నొంద్ జేయ దొలుకాడున్ నార్ది వేలాలుత
       త్క చుతంబై నలమానమీనమయి యుద్యన్నక్రమై యుత్తర
       త్తిమియై యుల్లందంబు మగ్నఢులియై ధీరా మహాభైరవా.

మైలారదేవుడు

  బ్రాహ్మణేతరజాతులలొ భైరవార్చనముతొ పాటు మైలారదేవుని పూజ కూడ ముఖ్య మైనదిగ బరిగణింప బడుచుండెను. ఏకశిలానగరమున మైలారదేవుని యుత్సవములు  మహావైభవముతో జరుగుచుండినవి. ఆకాలమునందలి కవి వర్యులచే నీమైలరదేవు డీవిధముగా బ్రశంసింప బడుచుండెనో క్రీడాభిరామము లోని యీక్రింది పద్యమువలన బోధపడగలదు.