పుట:Andhrula Charitramu Part 2.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాస్కరుడు కాడనియు హుళక్కి భాస్కరు డరణ్యకాండమును యుద్ధకాండములో గొంతభాగమును రచించె ననియు, బాల, కిష్కిందా, సుందరా కాండములను దత్పుత్త్రు డగు మల్లికార్జున భట్టును, అయోధ్యాకాండమును శిష్యు డగు కుమారరుద్రదేవుడును, యుద్ధకాండ శేషమును మిత్త్రుడగు నయ్యలార్యుడును విరచించి ననియు, ఇందఱు కవులీగ్రంధమును విరిచించుటకు గలకారణము తనచే శిక్షితు లగు శిష్యవర్గముతోడ గూడ నీగ్రంధమున నుండుటకు భాస్కరుడు తలచెనట సమంజ సమనియు ప్రతి పక్షుల వాదమై యున్నది. మంత్రిభాస్కరు డైనను హుళక్కి లేక హుళక్కి భాస్కరుడైనను రామాయన మంతయుగాక కొంచెము భాగమును మాత్రమే రచించిన వారుగా నున్నారు. మంత్రిభాస్కరుడు సాహిణిమారుని కాలము నాడు కాడనుట నిశ్చయము. దశగతులను గ్రంధమును భాషాంతరీకరించి సాహిణి మారుని కంకితము చేయుటాచేత భాస్కరుండను మహాకవి యొకడు సాహిణి కుమారుని కాలమున నున్నవాడనుట నిశ్చయము, సాహిణెకుమరుడు రెందవ ప్రతాపరుద్రచక్రవర్తి సైన్యధిపతులలొ నొక్క డనుటయు నిశ్చయము. క్రీ.శ.1311 వ సంవత్సరమున గురిజాల పింగళిస్థలములు చేరియున్న పల్నాటి సీమ కధికారిగ నియమింపబడిన మారయ సాహిణింగారు ప్రతాపరుద్రునిగజసాహిణియైన గుండయనాయనింగారికిని మారయసాహిణిగారికిని పుణ్యముకొఱకు దానశాసనము వ్రాయింఇయుండెను.!. కనుక భాస్కర రామాయణము సాహిణి మారుని కంకితము చేయబడుటచేతను, దశగతులను దెనిగించిన భాస్కరమహా కవి తదాస్థానకవిగ నుండుటచేతను, అంతకు బూర్వము రంగనాధరామాయనమును తరువాతను ఎఱ్ఱాప్రెగ్గడరామాయణము నుండుటచేతను, ఈ రామాయణమును భాస్కరరామాయణ మని యిటీవలివారు వ్యవహరించుచున్నారు. సాహిణిమారుడు గోనబుద్ధారెడ్డి పుత్త్రుదే యైనపక్ష


1.Annual Report on Epigraphy for 1910. para 48.