పుట:Andhrula Charitramu Part 2.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంధమణీభూషణముయొక్క పీఠికలో శ్రీమానవల్లి రామకృష్ణయ్యగారు వక్కాణించి యుండుటయే గాక ప్రకటించిన యాలూడుపూరి శాసన వ్యాఖ్యానములోనే సాహిణిమారుని తండ్రియు రామాయణకృతీకి కర్తయు నగు బుద్ధయయు నొక్కరేయని నిరూపించుటక్జు జాలినంత ప్రమాణము గానరాదని వ్రాసియున్నార్. కాబట్టి రంగనాధరామాయణమును రిచించిన బుద్ధారెడ్డి సాహిణిమారుని తండ్రి యగ్తునా కాదా యని శంకింపలేదు. అట్లయిన పక్షమున బుద్ధరాజు పుత్రులు కాదవిభుడును నిర్జలరాజును ద్విపదగా రచించిన యుత్తర రామాయణ పీఠికలో సుప్రసిద్ధుడైన సాహిణిమారుడు తన సోదరుడని చెప్పికొని యుండకపోవుటకు కారణ మెమి? తండ్రియును సోదరులును మహాకవులై సలక్షణ మైన శైలిలో నొప్పుచున్న కావ్యమును రచియించి లెక రచియింపించి యుండగా మారయ సాహిణి మరల రామాయణమును రచియింప జేయుటకు గారణ మేమి? ఆరామాయణము కల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, భాస్కరుడు, అయ్యలార్యుడు మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, భాస్కరుండు, అయ్యలార్యుడు నను నల్వురు కవులచే రచియింపబది యుండగా దానికి భాస్కరరామాయణ్ మని పేరు గలుగుటకు గారణమేమి? ఈ నల్వురు కవులకుం గల సంబంధమెట్టిది? ఈవియంబుల నన్నింటిని పర్యాలోచించినం గాని సత్యము తేటపడజాలదు. తిక్కనసోమయాజిపితామహుడైన మంత్రిభాస్కరుడు రామాయణమును రచింప, నేమి కారణముచేతనో యారణ్య కాందము దక్క తక్కినకాందములన్నియు రశించిపోతా వానిని మారయసాహిణి యాస్థానకవి యగు హళక్కి లేక హుళిక్కి భాస్కరుడును అస్తని పుత్రుడైన మల్లికార్జునుడును, శిష్యుడైన కుమారరుద్రదేవుడును, మిత్రుడైన అయ్యలార్యు డును మరల రచించి రనియు పూర్వపక్షవాదమై యున్ందై. ఇట్టి యభిప్రాయమునకుం గలకారణము లాంధ్రకవుల చరిత్రమున వివరముమా వ్రాయబడినవి, శ్రీమద్రామాయణమును దెనిగించినది హుళక్కి భాస్కరమహాకవి కాని మంత్రి