పుట:Andhrula Charitramu Part 2.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నని అభివర్ణించి యున్నాడు. ఏకశిలానగర దుర్గప్రాకారములకు వెలుపలను గూడ వాటిక లనియు వాడ లనియు వ్యవరహింప బడెడు పేటలు విస్తరిల్లి యుండెను.

నాగయగన్నమంత్రి

   ఇమ్మహానగరమున కంతకును ప్రతాపరుద్రుని మంత్రులలో విశ్రుతుండగు "గన్నమనాయుడు" అను కమ్మసేనాని రక్షితపాలుడై క్రమశిక్షణ్ము నెఱపు చుండెను. ఈగన్నయమంత్రి మ?డికిసింగనకవి విరచిత మైన పద్మపురాణకృతికి భర్త యైన కందనమంత్రికి పిన్నతాత యని (అనగా గన్నయ మంత్రి జ్యేష్ఠభ్రాత యైన గణపతికందనమంత్రి మనుమడని) శ్రీవీరేశలింగము పంతులుగా రాంధ్రకవుల చరిత్రములో నుడికిసింగనకవిని గూర్చి వ్ర్రాయు సందర్భమున దెలుపుటచేత నీగన్నయమంత్రిని వారు నియోగిబ్రాహ్మణుడని యభిప్రాయపడి నత్లు విదిత మగుచున్నది. ఆయభిప్రాయము సరియైనదికాదు.  గన్నయ మంత్రి చతుర్ధకుల భూషణుడని మారన కవికృత మైన మార్కండేయపురాణము లో విస్పష్టముగా దెలుపబడి యున్నది.  నన్నయ మంత్రికి నాయకత్వము ప్రతాప రుద్రునివలననే యనుగ్రహింపబడినట్లుగా మార్కండేయపురాణమున నీక్రింది పద్యములో జెప్పబదినది.

"చం. ఎలమి బ్రతాపరుద్ర మనుజేంద్రునిచే బడసెం బ్రవీణు డై
       కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావని గీ టడంచియు
       న్బలరిపుతుల్యనిక్రముడు నాగయగన్నవిభుండు తేజము
       న్విలసితరాజ్యచిహ్నములు విశ్రుతలక్ష్మెయు నాయకత్వమున్."

   ఈగన్నమంత్రి కాకతిక్ష్మాతలాధీశకటకపాలు డని మార్కండేయ పురాణమునం బలుతావుల బేర్కొనబడి యుండుటయే గాక యీక్రింది పద్యములో బ్రత్యేకముగా నభివర్ణింపబడియెను.