పుట:Andhrula Charitramu Part 2.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భయంకరమై, ఏకశిలానగరము వన్నెకెక్కి యుండెను. ఎక్కడ జూచినను దేవాలయ గోపురములును, ఎక్కడ వీక్షించినను రాజభవనంబులును రమణీయంబు లై ప్రకాశించుచుండెను. ఏకశిలానగరములోని సౌధాగ్రములు మణిహెమకుంభములతో నలంకరింపబడి యున్న వని యొకకవి వర్ణించి యున్నాడు. మంచనగొవిందశర్మయను బ్రాహ్మణుడు టిట్టిభసెట్టి యను వైశ్వ మిత్త్రులతోడ నేకశిలానగరమును బ్రవేశించిన విధానమును వల్ల భామాతకవి క్రీడాభిరామమను గ్రంధమున నిట్లభివర్ణించి యున్నాడు.

     "సీ. సప్తపాటాళ విష్టప్ మహాప్రస్థాన
              ఘంటాపధం బైన ఘనసుపరిఖ
          తారకామండల స్తబకావతంసమై
              కనుచూపు గొనని ప్రాకారరేఖ
         పుంజీబవించినభువన గోళము భంగి
              సంశులాంగణమైన వంశ దార
         మెఱుగ ఱెక్కలతోడి మేరుశైలముబోలు
             పెనునైడి తలుపుల పెద్దగవిని
    గీ. చూచిచేరె బ్రవేశించె జొచ్చె బ్రీతి
           సఖుడు దాసుడు రధఘోట శకటకరటీ
       యూధసంబాధముల కొయ్యమోసరిలుచు
          మందగతి నోరుగల్లు గొవిందశర్మ."
  మఱియు:--
     "రాజమార్గంబు వారణఘటా ఘోటక
          శకటికాభటకోటి సంకలంబు
      ధరణీస్థలీరజ స్త్రసరేణు బహుళంబు"


అతిశయోక్తులను విడిచిపెట్టిన పక్షమున కోటచుట్టును గల యగర్త మిక్కిలి లొతుగల దనియు, ప్రాకారముములు మిక్కిలి యెత్తుగలదనియు, భావ మేర్పడుచున్నది.