పుట:Andhrula Charitramu Part 2.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనేక భూదనములను జేసి యుండె నని త్రిపురాంతకము మొదలయిన ప్రదేశములలో గలయునేకశిలాశాసనములవలన వ్యక్తమగుచున్నది.

అంబయదేవమహారాజు

   త్రిపురాంతకం కనిష్టసోదరుడుగా జెప్పబడిన యంబయ దేవమహారాజు గండికోటను మోరధపురము రాజదానిగ గండికోట, ములికినాడు, రేనాడు, సెనాదాడి, పెడకట, సకిలియెయెరువ, పొత్తపినాడు, మొదలుగా గల సీమల నేలుచు త్రిపురాంతక దేవునకు సహాయుడై యుండెను. ఇతనికి ఘోడెరాయగంగి దేవయ్య సేనాపతిగ నుండెను.  అంబదేవుడు శ్రీపతి గణపతియను వానిని జయించి "రాయసహస్రమల్లుడు"అను బిరుదమును వహించెను. మఱియు నితడు దోర్దర్పమున నెల్లశత్రురాజుల యుద్ధరంగమున నెదుర్కొని యెరుకమల్లి దేవుని, శీశదేవుని, సోమిదేవుని, అల్లుగంగుని, దేవబ్రాహణులకు గర్భ శత్రి వైన మల్లికార్జునిని, కదంబరాజయిన దామోదరుని జయించెను. రాజ్యభ్రష్టుడైన మనుమగండగోపాలుని విక్రమసింహ పురంబున సింహాసన మెక్కించెను. కడవరాయని నాశనము గావించెను.ఇతడును త్రిపురాంతకదేవునివలెనే బ్రాహ్మణులకు దేవ మత గురువులకు దేవమతములకు శివాలయములకు ననేక భూదానములను గావించెను. ఊటుకూరు నందొకగొప్ప చెఱువు త్రవ్వించి అంబసముద్ర మని పేరు పెట్టించెను. ఇతని మంత్రి అత్తిలిరేల యనుగ్రామము లోని పరశురామేశ్వరుని యాలయమునకు మాన్యము లొసంగి యారామముల నిర్మింఇ సత్రములను గట్టించెను. కొన్ని గ్రామములో చెఱువులు కాలువలు త్రవ్వించెను. పొత్తిడినాటి సీమనంతయు గొలిపించి కొల యేర్పరించెను. మఱియు ననేక సత్కార్యము లచరించినట్లు దెలియుచున్నది. త్రిపురాంతక దేవుడును, అంబయదేవమహారాజును రుద్రమదేవి కాలమున మాత్రమె కాక రెండవ ప్రతాప రుద్ర చకరవర్తి కాలమున గూడనుండి రుద్రమదేవి యనంతరము స్వతంత్రులగుటకు బ్రయత్నించియు సాధ్యముగాక యతనివలన పరాజితులై తమ తోటి యధికారములను గొల్ఫోయినట్లు గన్పట్టుచున్నది.