పుట:Andhrula Charitramu Part 2.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రణతపకలనరపతి మనిమకుట కోటిమనుకరికాచ్ంబ్యమాన చరణనఖకిరణ కందళ కాకతికులతిలక రుద్రదేవ మహారాజ చరణవ్ళినయుగళ సమారాధన, సమిధిగతసకలరాజ్యాధిపత్యమహవిభవ, చలమత్తుగండ, ఝూరురాయ జగదళ మండలీక బ్రహ్మరాక్షస, గండపెండారు, త్రిపురాంతక దేవమహారాజులు" అను విశేషణములతో బేర్కొనబడి యుండుటచేతనే రుద్రమదేవి చక్రవర్తి నీకాలమున నప్రతిమానప్రతాపవంతుడైయుండెనని వేద్యముగాక మానదు. ఈబిరుదావళి నంతయు గణపతిదేవచక్రవర్తి సైన్యాధ్యక్షు డైన గంగనాసాహిణియు వహించి యుండుటచేత నిత డాతనికి కుమారుడో సోదరుడో యై యుండవలయు నని యూహించుచున్నాడను. అందుచేత మహారాజు కుమారుడు త్రిపురాంతక దేవు డని సిధ్దవటము సీమలోని వరికుంటగ్రామములో నొక శిలాశాసనమునం గలదని యొకస్థానిక చరిత్రమునం జెప్పంబడినది గాని దొరతనమువారి శాసనపరిశోధకులు "అంబదయదేవ మహారాజును" త్రిపురాంతక దేవుని కనిష్ఠ సోదరునిగా చేర్కొని యున్నారు!. వీరి సిద్ధాంతమె సరియైనది కావచ్చును. అంబదేవుడు త్రిపురాంతకదేవుడు వీర లుభయులును గూడ కడప మఠాధిపతి యైన అఘోరశివాచార్యులవారి శిష్యులయిన వీరశైవులుగా నుండి యనేక దానములను జేసి ప్రఖ్యాతి వహించియుండిరి. త్రిపురాంతకదేవుడు మొదట దువూరును తరువాత ములికినాటి సీమలోని వల్లూరుపట్టణమును రాజధాను లుగ జేసికొని పరిపాలనము చేసెను. రుద్రమదేవి పరిపాలన ప్రారంభకాలమున స్వతంత్రులగుటకు బ్రయత్నించి దేశముయొక్క శాంతికి భంగము కలిగించిన విజయగండ్ గోపాలుడు, ఎరువమాన్మిలిదేవరాజు, సిద్ధయదేవ చోడరాజు, మొదలగు చోడులను జయించి దేశమున శాంతిని నొక్కొలిపె నని తెలియుచున్నది ఇతడు వీరశైవు డైనందున శైవగురువులకును శైవమఠముఉలకును, త్రిపురాంతకములోని శ్రీత్రిపురాంతక దేవునకును శ్రీశైల మల్లికార్జున దేవునకును


1,Annual Report on Epigraphy for 1906, No>4902. Public 2nd July 1906.