పుట:Andhrula Charitramu Part 2.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొని వచ్చియేకశిలానగరమునం బ్రవేశించి వారల నిరువురను జంపించి వారల యైశ్వర్యమునంతయు జూఱగొని యాధనముతో పద్మాక్షీదేవికి మహోత్సవములు గావించెను. అప్పుడు దేవరిగినుండి మహాశూరుడైన మహాదేవరాజు అసంఖ్యాకము లయిన సైన్యములతో దండెత్తి వచ్చి యేకశిలానగరమును ముట్టడిచేసెను. ఇట్లు మూడులక్షల సైన్యముతో వచ్చి మహాదేవరాజు ముట్టడించి నను భీతి నొందక రుద్రమదేవి వెలమ సేనాని యగు రుద్రమనాయని నగరపాలకుండ్ను కమ్మసేనానియు నగు నాగచమూపతిని హెచ్చరించి యాసేనానుల సాయాయ్యముతో పదునేను దినములు ఘోర యుద్ధముసేయగా యాదవసైన్యములు వెలమకమ్మవీరులధాటికి నిలువజాలక పలాయనంబు లయ్యెను. రుద్రమదేవి యంతటితో దృప్తినొంది యూరకుందక తానె నాయకత్వములు వహించి యాదవసైన్యంబులను వెంటాడించి దురుమాడుచు దేవగిరివఅకు దఱిమి దఱిమి గొట్టగా మహాదేవరాజు తాను జేసిన యవివేక కృత్యమునకు పశ్చాత్తప్తుడై రుద్రమదేవిని శరణువేడి కోటిద్రవ్యంబు లపరాధముగ నిచ్చుకొని సంధి గవించుకొని నిజరాజధానికిబోయెను. అప్పుడు రుద్రమదేవి తన దేశమునకును మహాదేవరాజు దేశమునకును సరిహద్దున జయస్తంభములను పాతించి వానిపై శాసనములను వ్రాయించి యేబదిలక్షల హోన్నులను తన సైన్యములకు బంచిపెట్టెను.

జన్నిగదేవసాహిణి.

    కాయస్త్ర్హకులసంజాతుండైన యీజన్నిగదేవసాహిణి రాజభక్తి గలిగి తన మేనమామ యైనగంగయసాహినికి తరువాత సైన్యాధ్యక్షుండును, ఆప్తమంత్రులలో నొక్కడునై దక్షిణభాగమున ననంగా మార్జవాడి మొదలుకొని పానుగంటివఱకు గల దేసమును బరిపాలించుచుండెను. ఇతడు బ్రదికి యున్నంత వఱకు రుద్రమదేవికి దక్షిణభుజంబుగ నుండి యామెకు శత్రువులై రాజద్రోహమును జేయ బూనిన సేనానులను మాండలీకరాజులను శిక్షించుచు వచ్చి అరాజమనెడి యుపద్రవమునుండి దేసమును రక్షించెను. ఇతనికి బ్రహ్మరాక్ష