పుట:Andhrula Charitramu Part 2.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంక్తిభోజనము లేదని యర్ధ మగుచున్నది గదా. అందునకు గారణ మెద్దియో యుండక మానరు. ఇంతకు బూర్వము పద్మనాయకచరిత్రమునందలి వీరల జనాదికమును గూర్చి నిగూఢముగా దెలిపిన పద్యములను వివరించి యున్నాను. అవి గాక పద్మనాయక చరిత్రములోని వని మఱికొన్ని పద్యములు రావువంశీయులచరిత్రమునందు నుదాహరింపబడియున్నవి. అయ్యది సత్యాన్వేషణపరులైన వారిని గమ్యస్థానమ్నకుం గొనిపోవుటకుం జాలియున్నది.

   "సీ. రెడ్దిసంతతికి మాఱొడ్డిభేదం బైన
           కుల ముద్దరించి రీవెలమవారు
         పద్మనాయకమానభంగంబు గాకుండ
           బలియురై నెగడె రీ వెలమవారు
        గడిదేరి కాకతిగణపతి గొలిచియు
           నిల నేలు ప్రభువు లీవెలమవారు
        కాపులమాటకై కడగి వెలమలందు
           నిలచినకూరు లీ వెలమవారు
       సభురగాంగేయపటిమచే జరుపువారు
          మిగుల మానంబునకు బ్రాణ మిచ్చువారు
       వినయఘను లైన నెరమన్నె వెలమవారు
          పద్మజఖ్యాతిచే భువి బరగువారు."
        

     అని పద్మనాయక చరిత్రమునం దొక పద్యము గానంబడుచున్నది.  దీనిలోని "రెడ్డిసంతతికి మాఱొడ్డిభేదం బైన కుల ముద్ధరించి రీ వెలమవారు" అను మొదటిచరణముయొక్క భావమ్న్ దెలిసికొనవలసియున్నది.  రెడ్లను బ్రతిఘటించి వేఱుపడిన కులము నుద్ధారణము చేసి రని భావ మేర్పడుచున్నది. ఇందలి భావమును దృఢపఱచునట్టి గాధ యెద్దియైన గలదా యని మనము దెలిసికొనవలసియున్నది.  అయ్యది పల్నాటి వీరచరిత్రమునం గానంబడుచున్నది.  అయ్యది పల్నాటి వీరఫరిత్రమునం గానంబడుచున్నది. అందు బ్రహ్మనాయుడు నాయకురాలితో జేసిన యుద్ధము కులము పోరని పలుతావుల బేర్కొన బడియున్నది. అందు కులవిచక్షణము లేక