పుట:Andhrula Charitramu Part 2.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మనాయుడు మాలలు, మాదిగలు, గొల్లలు, కంసాలులు, కమ్మరులు, కుమ్మరులు, రెడ్లు, మొదలగు తెగవారితొ గలిసి చాపకూడుకుడిచె నని చెప్పం బడియున్నది. ఇట్టి చాపకూడుకుడుచుట కూడ పల్నాటి యుద్ధమునకు బ్రధమ కారనములలో నొక్కటిగ నున్న దని వల్లభామాత్య ప్రణీత మైన క్రీడాభిరామ మను గ్రంధమునందు.

   "గీ. అరువల్లి నాయిగారి దుర్మంత్రంబు
         కోడిపోరు చాపకూటికుడుపు
         ప్రధమకారణములు పల్నాటి యేకాంగ
         వీరపురుషసంప్రహారమునము"

   అని స్పష్టముగ జెప్పబడినది. "కోడిపందెములో సంభవించిన కలహ మీ యుద్ధమునకు మూలకారణము." అని విల్సనుగారు వ్రాసియుండగా వారు పల్నాటి వీరచరిత్రమును సరిగ గ్రహింపలే దని పల్నాటి వీరచరిత్రములొని బాల చంద్రయుద్ధభాగమున ప్రకటించిన శ్రీఉమాకాంతముగారు తమభావమును వెల్ల డించినారు.  పైనుదాహరింపంబడిన క్రీడాభిరామములోని పద్యమును కోడిపోరు గూడ పల్నాటి యేకాంగవీరపురుషసంప్రహారమునకు ప్రధమమారణములలో నొక్కటిగా నున్న దని బొధపడకమానదు. ఈపల్నాటివీరయుద్ధమున మాలలు గోసంగులు గూడ నాయకులుగ నుండి యుద్ధముచేసి రని పల్నాటివీరచరిత్రము నుండి కొన్ని దృష్టాంతముల నింతకు బూర్వము చూపించియున్నాను.  కాబట్టి పల్నాటి వీరులలో సుప్రసిద్దుడైన రేచెర్ల బ్రహ్మనాయుడు రెడ్దికులమునకు మాఱొడ్ది నానాజాతులలోనుంది నాయకుల రెడ్డిఅనికొని జాతిభేదములను బాటింపక పైని జెప్పిన కులములవా రందరితోడను గలిసి భ్రాతృభావమును బలపఱుచుకొనుటకై చాపకూడు భుజించి ప్రతిపక్షులను జయింఇ కులము నుద్ధరించి గౌరవము దెచ్చినవా డగుటంజేసి పద్మనాయక చరిత్రములో "రెడ్ది సంతతికి మాఱొడ్ది భేదంబైన కుల ముద్దరించి నీవెలమవారు" అని వ్రాయుట సంభవించినది. బ్ర్రాహ్మణులు సయితము పద్మనాయకులలో జేరి రని యూహించుటకు గూడ పల్నాటి వీరచరిత్రమున