పుట:Andhrula Charitramu Part 2.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేనోళ్ళ జాటుచున్నది. చరిత్రమునందు రెడ్లను కమ్మవారిని వెలమవారికిని సంబంధములు గానంబడుచున్నవి. ఇంతమాత్రముచేత సీ మూడు తెగలవారు నొక్కతెగలోనుండి యేర్పడినా రని చెప్పుటకును సాధ్యపడరు. ఈ మూడు తెగలకు జన్మస్థానములు గొల్లజాతులునుపల్లెజారులు నై యున్న వని చరిత్రము నందు దృష్టాంతము లనేకములు గానబడుచున్నవి. *ఆంధ్రసామ్రాజ్యవిజృంభణ కాలమున యదు సృష్టి భోజాంధకు లని;యెడి గొల్లజాతులవారికిని యవనశక పహ్లవాదులకును గలిగిన సమ్మేళనమువలన నూత్నరక్త మీ జాతులయందు బ్రవ్ఫహింపగా వీరలు విజృంభించి గంగాతీరము మొదలుకొని కన్యాకుమారివఱకు గల దేశములను వేఱ్వేఱు వంశనామములతో వేఱ్వేఱు కాలములందు బరిపాలించుచు వచ్చిరని చరిత్రము సాక్ష్యమిచ్చుచున్నది. ఆంధ్రసామ్రాజ్యము భగ్నమైన వెనుక వల్లభవంశ మను పేరిట సురాష్ట్రదేశామును బరిపాలించిన వారును, చాళుక్యవంశ మను పేరిట గుంతలవేంగీదేశములను, కాకతీయు లను పేరిట దెలుగుదేశమును బరిపాలించిన వార లీ వెలమ కమ్మ తెగలవారే గాని యన్యులుగా గనుపట్టరు. ఈ రేండు తెగలలోనివారును వారివారి నామాంతము లను రెడ్డి యను బిరుద వాచిక పదమును జేరుకొని వ్యవహరింపంబడుచు వచ్చి నను రెడ్లకు ప్రతిస్పర్ధులుగ నుండుచు వచ్చిరి. రాష్ట్రకూటులకును (రెడ్లకు) ఛాళుక్యులకును కృష్ణా గోదావరీ మందలములలో కొండెసిగలు గలిగియుండిన కమ్మవారీ పంటమహాన్వయులయిన కొండవీటి రెడ్లకును పద్మనాయక వెలమలకును జరిగిన యుద్ధములు చరిత్రమున సుప్రసిద్ధిములుగ నున్నవి. దుర్జయవంశజాల మని చెప్పుకొన్నవారు పల్లవు లయినట్లు కృష్ణామందలములో నుయ్యూరు వరగణాలో జేరిన ముదునూరు గ్రామమౌలో బ్రతిష్ఠింపబడిన రామేశ్వర స్వామివారి యాలయములోని యొక శిలాస్తంభముపై వ్రాయంబడిన రాజరాజుయొక్కశాసనములో:-


  • ఆంధ్రుల సాంఘికచరిత్రము ప్రత్యేకముగా విరచింపంబడుచున్నది గావున నీ విషయమై యందు సవిస్తరముగ్తా జర్చింపబడును.