పుట:Andhrula Charitramu Part 2.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూస:Cernter

వెలమవీరులచరిత్రము.

కాకతి గణపతిదేవ చక్రవర్తికి భృత్యులుగ నుండి విక్రమాఢ్యు లని ప్రసిద్ధి గాంచిన వెలమవీరులు గొందఱు కాకతీయచక్రవర్తుల ప్రాపున బ్రబలి నాయకత్వములం బడసి బహుబూములను బరిపాలించినటులు గాధ లనెకములు చూపట్టుచున్నవి. వెలమవారు సంస్కారశూర్యులై శూద్రప్రాయులయిన క్షత్రియ సంతతివార మనియు, స్దమ్చాద్రుల మనియు జెప్పుకొను తెగల వారలలో నొకరుగ నున్నారు. ఈతెగవారిని గూర్చిన చరిత్రము సాంతముగా నిండు దెలుపుటకు సాధ్యపడక పోయినను గొంతవఱ కయినను వివరించుట యావశ్యకముగ గానబడుచున్నది. వెలమ శబ్దము "వెళ్లాస్త్మ" అనుశంబ్దము నుండి పుట్టినదని కొందఱు చెప్పుచున్నారు. "వెళ్లాస్మై" అనగా నీరుడు గట్టు వారు (వ్యవసాయకులు) అని యర్ధము. వర్మశబ్దభవము వెలమయని చెన్నపురి రాజకీయ కలశాలయందు సంస్కృతోపన్యాసకులుగా నుండి కీర్తిశేషులయిన ఎం. శేషగిరి శాస్త్రులవారు "శబ్దాశాస్త్ర" మను తమ గ్రంధము నందు వ్రాసియున్నారు. దక్షిణహిందూస్థానములోని దేశములను బరిపాలించిన వారిలో వర్మశబ్దమును నామముల తుదకు బెట్టుకొన్నవారు పల్లవులు, కదంబులు, ఛాళుక్య్హులు మొదలగువారుగా నున్నారు. పై కలాశాల యందు శేషగిరి శాస్త్రులవారికి బూర్వ మాపదవియందే యుండిన ఆసర్టుగారు పల్లవులే వెలమ లని వ్రాసియున్నారు. శబ్దముయొక్క వ్యుత్పత్తి యెట్టిదైనను వెలమలును కమ్మవారివలెనె మిశ్రజాతివా రయినటులు చరిత్రము