పుట:Andhrula Charitramu Part 2.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈపద్యమునందు నల్లసిర్ధిరాజు పేరు గనంబడుటచేత భీమకవికాలము కొంచె మించుగా నిర్ధారిత మగుచున్నది ఈ నల్లసిద్ధిరాజు పండ్రెండవ శతాబ్దము నంతము ననగబైజెప్పబడిన సాగిపోతరాజుకాలమున గడప మందలములోని వల్లూరుపట్టణము రాజధానిగ బొత్తపినాడు మొదలగు దేశములను బాలించెను. కవిజనాశ్రయము రచించినది గొకర్ణనృపాలుడుగాని యితడు గాడు. భీమకవి నివాసస్థలము గోదావరి మందలములో గోదావరీ తీరమున నున్న వేములవాడ యను పుణ్యక్షేత్రము.

                        గోపరాజు రామప్రధాని
      ఇతడు గణపతిదేవచక్రవర్తియొక్క బ్రాహ్మణమంత్రులలో సుప్రసిద్ధుడు. గణపతిదేవునికాలమువఱకును విశ్వబ్రాహ్మణుల మని చెప్పుకొను కంసాలులును, శూద్రులును మాత్రమే గ్రామకరణములుగా నుండుచు వచ్చిరి. గణపతిచక్రవర్తి బ్రాహ్మణులయం దభిమానము గలిగియుండుటచేత వాయుదొషగ ములన్నియు నియోగిబ్రాహ్మణుల కిప్పింపవలసినదిగా దన మంత్రులలో నొక్కడయిన వైగోపరాజు తానుప్రధానిని నియమించె నని చెప్పుదురు. అప్పుడాతడు చక్రవర్తి యాజ్ఞాప్రకారము నియోగిబ్రాహ్మణులకు మిరాసీల నేర్పఱిచి తెలుగురాజ్యమునం దంతట నియోగిబ్రాహ్మణులనే కరణములుగా నియోగించె నని ప్రతిగ్రామముయొక్క స్థానిక చంత్రమునందును వ్రాయబడి యున్నదిగాని యీమంత్రిపేరు దెలుపునట్టి గణపతిదేవునినాటిశాసనము మొక్కటియైనను గానరాదు. ఇతని ప్రసిద్ధి యాంధ్రదేశమునందతట వ్యాపించి యున్నదనుట వాస్తవము.  ప్రమాణరహితములైన విషయముల నెత్తి వ్రాయుట కన్న భావిపరిశోధనమున వీటిని చరిత్రము దెలియనంతవఱకు సంక్షేపించిమిన్న కుండుటయే యుక్తముగా గన్పట్టుచున్నది.
                     గం గ య సా హి ణి.
  ఈగంగయసాహిణి గణపతిదేవచక్రవర్తి యొక్క మహాప్రధానులలోనొక్కడు. ఇతడు హైదరాబాదురాజ్యూములో నల్లగొండజిల్లాలోని పాను