పుట:Andhrula Charitramu Part 2.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలయును గాని, యన్యులుమాత్రము గాదు. విశ్వేశ్వరశివదేశికులే శివదేవయ్య యని నాయభిప్రాయము. వీర లిరువుర దానశాసనములు భట్టిప్రోలు త్రిపురాంతమౌ మొదలగు ప్రదేశముల గానబడుచున్నవి. కాకతిగణపతిదేవ చక్రవర్తిని జూడఫచ్చిన తిక్కనసోమయాజి.

    "గీ. వసుమతీనాధ యీత డీశ్వరుడు గాని
         మనుజమాత్రుండు గాడు పల్మాఱు నితని
         యనుమతంబున నీవు రాజ్య్హంబు నెమ్మి నేలు"

మనిచెప్పి కొనియాడి దీవిశ్వేశ్వరశివదేశికులనే యైయుండవలయును గాని యట్టివారు మఱియొక రాయాస్థానమునం గనుపట్టరు.

                 కాలచమూపతి - భాండసేనాధిపతి
   వీర లిరువురును గణపతిదేవచక్రవర్తి సేనాధిపతులు. కాటచమూపతి కొడుకు భాండసేనాధిపతి. భాండసేనను జయించినవాడగుటచేత నీకడపటి వానికి భాండసేనాధిపతి యని బిరుదు కలిగెను. ఈసేనాధిపతు లిరువురు నిత్తరదేశము నేలు రాజులతో గణపతిదేవుని పక్షముననుండి యుద్ధము చేయుచు నున్ననే గాంచుచుండిరి. వీరి నివసస్థలము నిర్మల యని పట్టణము. చతుర్ధవంశమున దుర్జయుడు జనించెను. అతనివంసమున మల్లాలనాధుడు పుట్టి పెద్దముట్టిగండ డనువీరుని నతనిబంధువర్గమున్ నాశనము గావించెను. మల్లాలనాధునికొడుకు సబ్బిసేనాధిపతి. ఇతడును శత్రురాజుల నిర్జించెను. ఇతనికి అచ్చమ యనుభార్య యందు గాటచమూపతి జనియించెను. ఈకాటచమూపతి మొట్టమొదట కాకతి రుద్రదేవరాజుకడను, అటుపిమ్మట గణపతిదేవచక్రవర్రికడను సేనాధిపతిగనుండి బొల్లమాంబవలన పోతనాయుడు, భాండసేనాధిపతి, అను నిరువురు గొమారులను గాంచెను. కాటచమూపతి శా.శ.1162 శార్వరిసంవత్సర ఫాల్గునశుద్ధ 11 స్థిరవారమునాడు కొందిపర్తియను గ్రామమునందు త్రిమూర్తులను నొకట బ్రతిష్ట గావించి దేవాలయమును గట్టించి బెల్లము చెఱువు గ్రామమును దేవుని కైంకర్యములకై