పుట:Andhrula Charitramu Part 2.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణపతిదేవుని పేరిట గణపతీశ్వరాలయమును గట్టించి దానికి ననేకగ్రామము లను దానము చేసెను. ఈదానశాసనము శా.శ.1153 ఖరసంవత్సర వైశాక శుద్ధ తృతీయదినమున వ్రాయబడినది. ఈశివాలయముపోషణమునకై పడవయొక్కం టికి నొక్కపణము పన్నుగ గైకొనుటకు నియమింపబడియెను.1 మఱియు నితడు శా.శస్.1157 వ సంవత్సర వైశాఖశుద్ధతృతీయా శనివారమునాడు తామ్రపురము (చేబ్రోలు) లో తన తండ్రిపేరిట చోడీశ్వరలింగమును ప్రతిష్టాపించి యాశివాలయ మున కెదుట దేవదాసీలు నివసించుటకై రెండేసియంతరువులుగల రెండువరుస ల యిండ్లనుగట్టించి దేవుని యంగరంగ భోగములకై మ్రొంతకూరు (చేబ్రోలునకు 6 మైళ్లదూరమున నున్న మోదుకూరు) గ్రామమును దానముచేసెను.2

                           విశ్వేశ్వరశివదేశికులు.
      వేదవేదాంతార్ధము లెఱింగిన జ్ఞానసంపన్నుడని ఖ్యాతిగాంచిన యీశివ యోగి శైవగురుపరంపరలోనివాదు. కాకతిగణపతిదేవచక్రవర్తికి గురువును మహా ప్రధానియు నై రాజకీయార్ధికసాంఘికవిషయంబుల దగునాలోచనములం జెప్పుఛు రాజ్యతంత్రమును నడిపించుచు నాచక్రవర్తి యౌన్నత్యమున కంతకు గారణభూతు డయ్యెను. ఆంధ్రదేశములో బ్రఖ్యాతిగాంచిన శ్రీగోసంగి, శ్రీశైలము, శ్రీపుష్పగిరి మొదలగు శైవమఠముల కెల్ల నధికారిగ నుండి శ్రీకాకతిగణపతిదేవ చక్రవర్తిచే శైవమతము నాంధ్రదేశమున వ్యాపింపజేసిన గురుమల్లికార్జున పండితారాధ్యులవారి తరు వాత నితడు సుప్రసిద్ధి గాంచెను. సోమదేవరాజీయాది గ్రంధములలో గణపతిదేవుని సచివగ్రణి యని పేరెన్నిక గాంచిన శివదేవయ్య యను నాతడీ విశ్వేశ్వరశివదేశికులే యని జెప్పవచ్చును. ఇతడు గానియెడల నితనివలె బ్రసిద్ధిగాంచినట్టి యితనికుమారు డగు పరిపూర్ణశివమహామునియై యుండ

1,Epigraphia Indica Vol.III. P. 82 ff; No.15 Ganapeswaram Inscription of the time of Ganapati.

 2,Ibid No.5, Chebrolu Inscription of Jaya