పుట:Andhrula Charitramu Part 2.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీరశైవము.

       మఱియు బ్రహ్మనాయునిపక్షమున వీరశైవులుగూడ కొందఱు కలరు. అల రాజు, కొమ్మరాజు మొదలగు వారెల్లరును వీరశైవులు.  బాలమలిదేవరాజు మొదలగువారు శైవమతావలంబశులేగాని వైష్ణవులు గారు. అనుగభూపతి, నరసింగరాజు, నాయకురాలు మొదలగువా రెల్లరును శైవమతావలంబకులు. పల్నాటి వీరయుద్ధమున వీరశైవులును వీరవైష్ణవులును మతభేతములను విడిచి బాలమలిదేవరాజుపక్షమున నిలిచి యుద్ధము చేసినది వింతగా నుండక మానదు.
                           వీరారాధనము.
      పల్నాటివీరచరిత్రమున నభివర్ణింపబడిన వీరవరులను నాదేశమున నిప్పటికిని గొలుచుచున్నారు. బ్రహ్మనాయుడు విష్ణువనియు, విష్ణ్వంశ సంభూతుడనియు వ్రాయుటయేగాక, యాసీమలో నాబాలగోపాలము నందఱు నట్లే నమ్మి యిప్పటికిని గారెముపూడిసమీపమున నున్న గుఱ్ఱముకొందబిలము లో దపం బాచరించుచున్నవాడని చెప్పవచ్చును. ప్రతిసంవత్సరము కార్తికమ్మసములో నాపల్నాటివీరులు యుధ్దరంగప్రదేశమున మహోత్సవ మొక్కటి జరుగుచున్నది. ఆయుత్సవమునకు వేలకొలది దూరదేశస్థులు  సయితము బోవుచున్నారు   కార్తీకశుద్ధపూర్ణిమనాడు యుద్ధరంగస్థలమున నెఱ్ఱని జెండా యెత్తుటయు, యుద్ధాహ్వానపత్త్రికలు చుట్టుపట్టులనుండు గ్రామము లవారికి బరివారాయుదాదిసామగ్రీసమెతులై రావలయు నని వ్రాయుటయు, నాబహుళామావాస్యనాడు రొచగావు, మఱుదినము రాయబారము, మూడవ దినము మందపూడు, నాల్గవదిల్నము కోడిపోరు, అయిదవదినము కల్లిపాడు, అనునవి వరుసగా జరుపుటయు, దానికి మూడవదిన మర్ధరాత్రమున యుద్ధ రంగమున రక్తముతోగలిపిన యన్నమును దిగంబరులై రణబలి యిచ్చుటయు మొదలుగాగలని యిప్పటికిని జరుగుచున్నవి.1  దీనినంతయును జరుపుటకు బ్రహ్మనాయని ముద్రకర్త యని  యొక పీఠాధ్గిపతి కలడు.
                                   ----

  1, వెలుగోటివారివంశచరిత్రము పుట. 20-