పుట:Andhrula Charitramu Part 2.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరుద్రదేవుని సమకాలికులు

                కమ్మనాటిరెడ్లు, లేక, కమ్మవారు.
  కృష్ణానది మొదలుకొని నెల్లూరిమండలమున కందుకూరు (స్కందపురము) వఱకుగల దేశము కమ్మకరామము(కర్మక రాష్ట్రము) ఆదియాంధ్రచక్రవర్తుల కాలమున వ్యవహరింపబడినది. అటుపిమ్మట బల్లపుకాలమున గమ్మరాష్ట్రము (కర్మరాష్ట్రము) అని వ్యహరింపబడినది. ఏదవశతాబ్ధప్రారంభమున నీదేశము పశ్చిమచాళుక్యచక్రవర్తులచే జయింపబడినది. ఈదేశమును బరిపాలించిన చాళుక్యులలో మొదటివాడు కుబ్జవిష్ణువర్ధనుడు. ఈకుబ్జవిష్ణువర్దనునితో గుంతల దేశమునుండివచ్చిన బుద్ధవర్మ మొదలగు సేనాధిపతులు గొందఱు కమ్మరాష్ట్రమున నధికారములను బొందిరి. వీరలు చతుర్ధాంవయులైన శూద్రులనియు దుర్జయవంశస్థులనియు శాసనములం బేర్కొనబడిరి. పండ్రెండవ శతాబ్ధమువఱకు వీరల చరిత్రము దెలియరాకున్నది.
     ఛాళుక్యులకాలమున గమ్మరాష్ట్రములోని యుత్తరభారము వెలనాదు లేక్ ఆఱువేలనాడు (షట్సహప్రదేశము) అనియు దక్షిణభారము కమ్మనాడు అనియు, వ్యవహరింపబడినవి. త్రినయనపల్లవునికాలమున మల్లవర్మ యను నాతడు షత్సహప్రదేశమును సంపాదించె నట ! పండ్రెండవశతాబ్ధ ప్రారంభమున వేంగీదేశమును చోడదేశమును, రాజరాజనరేంద్రునిపుత్రుడును చాళుక్యచోడ చక్రవర్తియ్లు నైన మొదటికులోత్తుంగచోడుని కాలమున నేక సామ్రాజ్యమునకు లోబఱుప బడినప్పుడు మల్లవవర్మవంశజులే రాజ ప్రతినిధులై వేంగీదేశమును పరిపాలించిరి. అప్పుడు దుర్జయవంశస్థు లయిన