పుట:Andhrula Charitramu Part 2.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మనాయుడు మూఢభక్తియు, మూఢవిశ్వాసములు గలవాడు గావున దుష్టనక్షత్రెమున జనించిన కుమారుడు బ్రదికియుందిన నేమిక్రీడువాటిల్లునో యని బెంగగొని మనస్సును స్థిరపఱచుకొనలేక బంధువులు, మిత్రులు, పరివారజనంబులు, సభ్య్హులు మొదలగువారందఱ గుండియ లవియునట్ల మరల తన కుమారుని వధ్యశిలపై వధింపవలసినదని తన ప్రియభృత్యుడగు కనమదాసునకుత్తరవు గావించెను. అతడు ప్రభువు నాజ్ఞ శిరమౌనదాల్చి బాలుని వధ్యస్థానమునకు గొనిపోయి చూపఱెల్ల హాహాకారములు సేయుచుండ భైరవఖడ్గముతో బాలనాయని శిరమున నొక్కదెబ్బతీసెనంటగాని యేమిమహాత్మ్యముచేతనో యాఖడ్గము ముక్కలైచక్కలై పొడుమై క్రిందపడెను. బాలచంద్రునిశిరము నిర్భేద్యమై నొవ్వక యుండెనట ! అంతట బాలనాయుడు బ్రంహనాయని సభకు దేబడియెను. సభాసదులుబాల నాయని ప్రాణములౌ రక్షింప బ్రార్ధించిరి. బ్రహ్మనాయుడు వారల ప్రార్ధనల మన్నించి తుదకు బుత్రుని స్వకుటుంబములో జేర్చుకొనియెను. అటుపిమ్మటదనకొడుకునకు మంచాలమ్మను ఇచ్చి పెండ్లిచేయు మని కన్నమనాయని అడిగెను. అతడు దురాశాపీడుతుడై విశేషధన మీయవలవినదని కోరెనట! అందులకు బ్రహ్మనాయు డంగీకరించి యమితసువర్ణమును గానుకగా పంపించి క్రమముగా నొక్క శుభమొహూర్తమునబాలనాయనకిని మంచాలమ్మకును మిక్కిలి వైభవముతో వివాహంజు గావించెను.

                     నాయకురాలి మాత్సర్యము.
      బ్రహ్మనాయని వైభవమునంతయు జారులవలన దెలిసికొని వారివిభవాభి వృద్ధితనప్రభువుపరిపాలనమునకు భంగముకలిగించునని మాత్సర్యమును బూని నాయకురాలు మాచెర్లపట్టణమును దోచుకొనిరండని గడెకారులయిన దోపిడికాండ్రను, నాగరికములేని చెంచులు కోయలు మొదలగు నడవిజనంబులను బంపెను కాని, మహావీరుడైన మాలకనమదాసు వారల నెదుర్కొని పొరాడి యోడించి వారలవీపులపైఇసుక బస్తాలను గట్టించి పశువులను దోలుకొనివచ్చినట్లుగా వారిని వెంబడించివచ్చి గురిజాల బ్రవేశించెను. నాయకు