పుట:Andhrula Charitramu Part 2.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాత్య గౌరమ్మ; సూర్నీనిభార్య సీరమ్మ; మల్లినెనిభార్య మాచమ్మ. వీరిలో బ్రహ్మనాయనిభార్య యగు నైతాంబకు మాత్రము సంతానము గలదు. ఐతాంబకు విష్ణువరప్రసాదమున బాలనాయడను పుత్రుడు మహాశూరుడుద్బవించెను. మఱియు విష్ణువుయొక్క యనుగ్రహముచేటనే "యొక బ్రాహ్మణయువతికి జనించినట్టి అనపోతరాజు, ఒక వెలమస్త్రీకి జనించినట్టి దోర్నీడు, ఒక చాకలివనితకు జనించిన దందన్న, ఒకకుమ్మరకొమ్మకుజనించిన తేర్కుడు, ఒక కంసాలికి జనించిన చందన్న, ఒకమంగలిభామకుజనించిన మంచన్న," అను నార్గురుపుత్రులు బాలనాయనికి నుగ్గుపాలనాటినుండి మిత్త్రులై యాతనికి దిమ్ములవలెనుండి యట్లే వ్యవహరింపబడుచుండిరి. బాలనాయని జన్మనక్షరము మంచిది కాదని దైవజ్ఞలయిన బ్రాహ్మణులు చెప్పినందున బ్రహ్మనాయడు వానిని జంప దన ప్రియసేవకుని క్జనమదాసును కన్నమనాయని వినియోగించెనుగాని యతడట్లు వానిని జంపలేక బ్రహ్మనాయనితమ్ముడగు పేర్నాయనివశము గావించెను.1 అప్పటినుండియు బాలనాయని బేర్నీడు పెంచుచుండె నని చెప్పబడియెను. పైనిజెప్పిన వరప్రస్సాదజనితులైన యాఱ్వురు బిడ్డలును పేర్నీని గృహముననే పెరుగుచుండిరట!

                        బాలనాయని వివాహము.
        కొన్నిసంవత్సరములు గడచినవెనుక గండుకన్నమనాయడనువాడు బ్రహ్మనాయనిసభలో నాతని కెదురుగ గూరుచుండి తనకొమార్తె మంచాలయను బాలికను దగ్గఱనుంచికొని యీమె నొక యుత్తమ కులీనుడైన యౌవనవంతునకు వివాహముచేయ నభిలషకలదని పలుకగా ఆలకించి పేరినీడు తనయింట బెరుగుచున్న బ్రహ్మనాయనిపుత్రుని రప్పించి తనప్రక్కన గూరుచుండబెట్టుకొని యాతనికిచ్చి వివాహము చేయవలసినదని కన్నమనాయనితో బలికెను. బ్రహ్మనాయుడు తనకుమారుడైన బాలనాయని గుర్తించి యత ఏట్లుమరల బ్రదికె నని యాశ్చర్యపడసాగెను. కనమదాదు జరిగిన వృత్తాంతమును వెల్లడించెను.

1. ఇతడు మాలవాడైన అప్పలినాయనికిని నిమ్మసానికిని బ్రహ్మనాయనివరమున బుట్టినవాడు.