పుట:Andhrula Charitramu Part 2.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిలువబడుచుండవచ్చునుగాన, నతనికి దొడ్డనాయుడని నామాంతర ముండ వచ్చునని సమాధానము జెప్పి సమర్ధింప జూచుచున్నారు. రేచెర్లబేతిరెడ్డి బేతాళనాయుడన్మి చెప్పుటచేత మఱియొక చిక్కు తటస్థమయ్యెను. బేతిరెడ్డికి మల్లారెడ్డి యనుపుత్రుడు కలడని బేతిరెడ్డి భార్యశాసనములో జెప్పబడి యున్నది. అప్పుడు మల్లనాయనికి దామానాయుడని నామాంతర ముండ వచ్చునని సమర్ధింప జూచుచున్నారు. ఈ యంతలబొంతలమాఱిబంధమువలన బేతిరెడ్డికొడుకు మల్లారెడ్డి కొందఱకు మల్లానాయడుగాను, మఱికొందఱకు దామానాయుడుగాను, ఇంకకొందఱకు దొడ్డనాయుడుగాను, వెలుగోటివంశ చరిత్రకారులకు "మల్లానాయుడు, దామానాయుడు, దొడ్డనాయుడు, అను త్రిస్వరూపము లేకరూపముగాను గన్పడజేయు;నట్టి యవతారములుగాంచి కడగండ్లపాలు గావలసి వచ్చినది. పోనిండు ఆగ్రందకర్తలయ్హభీష్తానుసారముగానే మల్లానాయుడే దామానాయుడనుకొందము. అట్లయిన నెఱ్ఱక్కసానిశాసనము నాటికి మల్లానాయుడు నామానాయుడు అను దొడ్డనాయనికి సంతానము లేదని యెఱ్ఱక్కసానిశాసనమునుబట్టి స్పష్టమేగద! అనగా క్రీ.శ.1208 వ సంవత్సరము నాటికి దొడ్డనాయనికి సంతానము జనింపలేదు. ఒకవేళ బుట్టినారని యూహించినను శిసువులై ల్యుండవలయును గదా. బ్రహ్మనాయనికాలము మను తెలిసికొన్నచో హధర్దస్థితి బల్పడకిఅ మానదు. పల్నాటిప్రభు వయిన యలుగు రాజుపుత్రులలో మలిదేవరాజుపక్షమునుబూనిన బ్రహ్మనాయనికికి నలగామరాజుపక్షమును బూనిన నాగాంబ యనియెడు నాయకురాలికిని ఘోర యుద్ధముజరిగె ననుట పల్నాటి వీరచరిత్రమువలన బ్రసిద్ధ మగుచున్నది. ఈ యుద్ధము క్రీ.శ. 1176-1182 సంవత్సరముల నడుమ జరిగె నని యనేక చరిత్రాంశములను బట్టి నిర్ధారింపబడుచున్నది. పల్నాటివీరచరిత్రమును బ్రతాపరుద్రుడు నలగామరాజునకు యుద్ధకాలమున వేయిగుఱ్ఱముల నంపె ననియు, ధరణికోటరాజైన భీమరాజునకు వర్తమానమంపెననియు, అతనికొడుకు రెండవకేతరాజు రాయబారము వహించె ననియు, నలగామరాజునకు సాగిపోతరాజు సాహాయ్యమున