పుట:Andhrula Charitramu Part 2.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యము లన్నిటినిజూచి విమర్శించినప్పుడు చెవిరెడ్డిగాధ విశ్వాసపాత్ర మైనది గాదని నిష్పక్షపాతబుద్దిగలవారికి బోధపడక మానదు.

   ఈ గాధల నన్నిటిని విడిచిపెట్టి వెలుగోటివారివంశవృక్షమునం జేర్చబడిన పురుషులయ్హొక్క కాలనిర్ణయాదివిషయములనుబట్టి చూచినను, ఏతచ్చరిత్రములోని పురుషులనుగూర్చి వ్రాయబడిన యసందేర్భ వాక్యములను బట్టి చూచినను, బేతిరెడ్డి వేంక్టగిరి, మైలవరము, పిఠాపురము, బొబ్బిలి, జటప్రోలు సంస్థానాధిపతులకు మూలపురుషుం డను సిద్ధాంతము నిలువ జాలదు.
                       బేతిరెడ్డి మూలపురుషుడు కాడు
   వెలుగోటివారి వంశఫరిత్రమునందు పిల్లలమఱ్ఱి బేతాళనాయనికి "రామానాయుడు, ప్రసాదారిత్యనాయుడు, రుద్రనాయుడు," అను ముగ్గురు కొడుకులు గలరనియు, వారిలో జ్యేష్టుడైన రామానాయనికి "1 వెన్నమనాయుడు, 2.సబినాయుడు, 3.పెద్దన్న, 4.బ్రహ్మనాయుడు, 5.పేర్నీడుజ్, 6.సూర్నీడు, 7.మల్లినీడు"అను పుత్రులు గలరనియు నుదాహరింపబడి యెను. శ్రీనాధకవిరాజప్రణీత మైన పల్నాట్వీరచరిత్రమున బేతినాయనికి దొడ్డనాయుడును, అతనికి"పెద్దన, బ్రహ్మనాయుడు,పేర్నీడు, సూర్నీడు, మల్లినీడు" అను నేవురుపుత్రులు గలరనియు, వ్రాయబడియున్నది. రేచర్ల బేతినాయనినామమున గాంచి భ్రమించియో, పల్నాటివీరులలో సుప్రసిద్ధుడైన బ్రహ్మనాయుడు వెలుగోటివారివంశము లోనివాడే యైయుండునన్న సంపూర్ణవిశ్వాస్దముచేతనో, పల్నాటి వీరులకాలముం దెలిపెడి చరిత్రాంశము లెఱుంగమిచేతనో, మఱి యేమికారణ ముచేతనో, పిల్లలమఱ్ఱిబేతాళనాయ;ని వంశమును పల్నాటిబేతినాయని వంశమును నొక్కటిగజేసి బేతిరెడ్డియే బేతాళనాయు డని హేత్వాభావములతో సిద్ధాంతము చేసియున్నారు.
         ంబ్రహ్మనాయనితండ్ర్ దొడ్డనాయుడని  పల్నాటివీరచరిత్రమునం జెప్ప బడియుండుటచేతను, పిల్లలమఱ్ఱిబేతాళనాయనికొడుకులలో దొడ్డనాయుడనువాడు లేకుండుటచేతను, సంబంధమునకు యెక్కువగలుగంగా బేతాళనాయనిపుత్రులలో దామానాయుడు జ్యెష్టుం డగుటంజేసి దొడ్డనాయుడను