పుట:Andhrula Charitramu Part 2.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారిచే గ్రంధస్థములు గావింపబడి సర్వత్ర వ్యాప్తి చేయబడి సత్యమైన చరిత్రాంశములను గప్పిపెట్టుచున్నవి.

            శ్రీవెలుగోటివారి వంశచరిత్రము.1
      ఈబేతిరెడ్దినిగూర్చి శ్రీవెలుగోటివారివంశచరిత్రమునం దీక్రిందివిధముగా వ్రాయబడి యున్నది.
      "వీరికి మూలపురుషుడు బేతాళనాయుడనిప్రఖ్యాతిగాంచిన చెవ్విరెడ్డి అను రాజు.  ఈరాజు ఘనతవహించిన కాకతిగణపతిదేవునిరాజ్యకాలమున శౌర్యూధైర్యాది లోకోత్తరగుణగణపరిపూర్ణుడై యామహారాజువలన మిగులమన్నన గాంఛుటయె గాక యనేకబిరుదములను మఱికొంతరాజ్యమును గాంచినవాడు. ఈఘనుడు వర్తమానవేంకటగిరిసంస్థానాధిపతులగు శ్రీశ్రీరాజగోపాలకృష్ణయాఛేంద్ర బహదుర్ కె.సి.వ.ఇ. వారికి నిరువదియెనిమిదవ తరమువాడు. ఈరాజశిఖామణి యీవెలుగోటిశాఖకుమాత్రమేగాక జటప్రోలు, బొబ్బిలి, పిఠాపురము, మైలవరము, మొదలకగు సంస్థానాధిపతులకు మూలపురుషుడు.;"
    ఇయ్యది బట్టులువ్రాసిన వ్రాతలను  నమ్మి యవిచారపూర్వకముగా వ్రాయ బడినవ్తాతవలె గాన్పించుచున్నదిగాని సహేతుకమైన ప్రమాణముతో గూడినదిగా గానంబడదు.  సొమదేవరాజీయమునందును, పద్మనాయక నాచరిత్రమునందును, వీని నన్నిటిని బరిశీలించి సంస్కరణ ముగావించి నూతనముగా బ్రకటింపీంచిన వేంకటగిరిరాజుల వంశ చరిత్రమునందును, పిల్లమఱ్ఱి శాసనములో నుదాహరింప బడిన బేతిరెడ్డియే పైసచిస్థానాధిపతుల మూలపురుషుడైన్మ బేతాళనాయుడని చూపించిన హేతువులు పరస్పర విరుద్ధములై

1. ఈగ్రంధము పద్మనాయకచరిత్రెము, పద్మనాయకచరిత్రము దిట్లేవ్రాయింపబడిన వేంకటగిరివారివంశావళి, ఆరెంటి ననుసరించి వ్రాయబదిన రావువంశీయులచరిత్రము మొదలగు గ్రంధములలో దమవంశమునుగూర్చి యసందర్భము లయిన విషయములు గలవని యూహించి శ్రీవేంకటగిరిమహా రారుగారు శ్రీ వెల్లాల సదాశివశాస్త్రులవారిచేతను, శ్రీఅవధానము శేస్గశాస్త్రుల వారిచేతను నూతనముగా వ్రాయించినది.