పుట:Andhrula Charitramu Part 2.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుక్తికిని సత్యమునకును దూరములైయున్నవి మఱియు నీగ్రంధములలోని నసత్యములైనట్టియు, విషయము లెన్నో యవిమర్శనపూర్వకముగా జొప్పింప బడినవి. వానిని జక్కంగా విమర్శించి యధార్ధ మిట్టిదని లోకమునకు వెల్లడి చేయకుందిన యెడల జనసామాన్య మాగ్రంధములలోని గాధలనే పరమప్రమాణ ములుగా శిరమునహింతురు.అందువలన సత్యమైనచరిత్రవ్యాపనకు బ్రతిబంధ కము లేదనియు, బేతిరెడ్డికి జెవిరెడ్డి యనునామము లేదనియు, బేతిరెడ్డి వేంకటగిరి, మైలవరము, పిఠాపురము, బొబ్బిలి సంస్థానాధిపతులకు మూల పురుషుడని చెప్పబదు బేతాళనాధుడు కాడనియు, సహెతుకముగా నిరూపింప బోవుచున్నాను.

                          చెవిరెడ్డి గాధ.
      (1) ఈరేచర్లబేతిరెడ్దికి బేతిరెడ్డియనియే జన్మనామముండెనుగాని చెవి రెడ్డి యను జన్మనామము లేదని బేతిరెడ్డి భార్యయైన యెఱ్ఱక్కసానమ్మ శాసనములో---

    "శ్లో. తస్మాత్తస్యాం సమజని మహాదేపాదాబ్జభక్త:
          ఖ్య్హాతోబేతస్తతఫ్వితరణప్రీణిత ప్రాణిబ్గో:
          అశాదక్రే ప్రవితత శరచ్చన్ద్రసాన్ద్రాంశురమ్యా
          య స్యాత్యర్దం జనసుఖసంత్నారినీ భాతికీర్తన:"

అని సంస్కృతమునందును, 'శ్రీమతు రేచెర్ల పిల్లలమఱ్ఱి బేతిరెడ్డిపండ్లము ' అని తెలుగునందును, ప్రయోగింపబడిన బేతిశ్యంచేతనే స్పస్టమగుచున్నది. కాబట్టి ప్రకృతము నైనామురాజ్యూమునకు జెందియున్న నల్లగొండమండలములోని యామనగల్లు రాజధానిలోను, ఆమనగంటికుత్తరభాగమున రెండుక్రోశములదూర ములోనున్న పిల్లలమఱ్ఱి రాజధానిలోను వసించి యాప్రదేశమేలినవాడు బేతిరెడ్డి కాని బేతాళనాముడను నామాంతరముగల చెవిరెడ్డిమాత్రము కాడు.