పుట:Andhrula Charitramu Part 2.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదయచోడుని జంపి పద్మావతిని పెండ్లియాడుట.

      అటుపిమ్మట రుద్రదేవుడు వారిని వెంబడించి తఱిమి యాంజనేయుడు లంకాపురమును దహించినటుల జొడోదయరాజుయొక్క నగరమును దగ్దము గావించి యానగరము మధ్య నొకమహాద్భుతమైన తటాకమును ద్రవ్వించెను. అంతకు బూర్వమే చోడోదయుడురుద్రదేవుని తన పరాక్రమమును విని భయకంపితుడై మతిపోయి పిచ్చియెత్తిదయ్యముసోంకి మృతినొందె నని యీ క్రింది శ్లోకమున జెప్పబడి యున్నది.

"శ్రీమద్రుద్రపరాక్రమోద్భవభ్ణవవ్యామోహనాభ్యుల్లస
             చ్చస్త్రత్రస్తసగాత్ర నిలవచ్చోడోదయక్షాపతే"
            ఉన్మత్తాఇవ విస్తృతాఇన మహాభూతాభిభూతాఇన
            ప్రోద్భ్రానావున సంకులాఇవ తదా ప్రాణా: ప్రయాతా దినమ్"/poem>
పైన జెప్పిన ట్లాచోడోదయునినగరమును దగ్ద గావించుటయే కాక యాతని కొమార్తను పద్మావతి యనుదానిని వివాహ మైనటుల నాశాసనమునందలి యీ క్రింది శ్లోకమువలన దెలియుచున్నది.
<poem>"కన్దూరోదయచోడవంశవిలసత్ క్షీరాబ్దిగర్భోర్భన
              త్సద్మైకాశ్రయరుద్రదేవ నృపతే, కిం వర్ణ్యతే విక్రమ:
              క్షుద్రక్షత్త్రకులోన్నతిక్షయకృత స్సర్వానవీశ్రీభృతో
              రామస్యేన కుతారఖణ్ణిత రిపున్రాతస్యపృధ్వీపతే:."

ఈ పైశ్లోకము ద్వంద్వార్ధమును సూచించుచున్నది. అయినను రుద్రదేవుడు పద్మావతిని వివాహముజేసిక్నెననుటయే యొప్పియున్నది. గాని మఱియొక శాసనమును బట్టి సందేహము కలుగుచున్నది.1 ఉదయచోడుని జట్చర్ల శాసనమునకును రుద్రదేవుని యనుమకొండ శాసనమునకును నడుమ 23 దినములు మాత్రమే వ్యవధికలదు. ఇందలి సత్యమును భావిపరిశోధనమున దెలిసికొన


1.See the Lithic Records in Hyderabad prepared by M.Ramakarishna Kavi M.A.