పుట:Andhrula Charitramu Part 2.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వలయును. ఉదయచోడునియొక్క్ శుల్కాధికారులయిన కిబ్బటమేల్వట్టదండ నాయక వలసిద్ధమయ్య సిద్ధిమయ్యలు శకసంవత్సరములు 1024 అగు చిత్రభాను సంవత్సరము పౌష్యబ 2 మంగళవారమున నుత్తరాయణ సంక్రాంతి నిమిత్తమై కోడూరిశ్రీస్వయంబూసోమనాధదేవునికి సుంకములు మొదలగు వానిని గల్పించి యుండిరి. ఇందు శాలివాహంశక మనుటకు బదులుగా శ్రీమచ్చాక్యూసకవర్షములు అని తప్పుగా గ్రాయబడినది.

    ఈజట్పక్షగ్రామము కందనోలి (కర్నూలు) నుండి హైదరబాదు నకు బోవుమార్గమున హైదరాబాదునకు దక్షిణమున 44 వ మైలురాయికడ నున్నది. దీనికి దిగువను 33 మైళ్లదూరమున కందూరు కలదు. ఇయ్యది కర్ణాటకఛోడు లకు రాజదానిగ నుండెను. వర్ధమానపురము మఱియొక చోడవంశమువార్కి రాజధానిగ నుండెను. ఈరెండు చోడవంశములకు నెట్టిసంబంధము గలదో యింత వఱకు  స్థిరపడలేదు.  ఉదయాదిత్యాలంకార మనియెడి గ్రంధమొకటి కర్ణాటకభాషలో వ్రాయబ?ది యున్నది. దానికర్తృత్వము చోదోదయుని కారోపింప బడుచున్నది. ఆగ్రంధమునందు చోడోదయుని తండ్రి సోమనాధుం డని చెప్ప బడి యున్నది. సరకులపై సుంకమును విధించు నాచార మాకాలమునందును గలదు. బద్దెనకవి (భద్రభూపాల) ప్రణీత మైన వర్ణన మీక్రిందిపద్యమున జేయబడినది.

"
చ. గనులు కృషి ప్రపంచ మరిగప్పము సుంకము గోకులంబు నం
     దనేవనముల్ జల స్థల పధస్థ వణిక్క్రయదుర్గరక్షణం
     బనగల యన్నిమార్గముల నర్ధమురోయక కేవలంబ కాం
     పున పొలియించు రాజు సిరిం బొందునె జమునోజభూభూజా.
           

        పుర పొలియందు రాజా సిరి బొందనె రాజమనోజభూభుజాఒరయూరు పురాధీశ్వరుల మని తెలుగుచోడులును, అయోధ్యాపుర వరాధీశ్వరుల మని ఛాళుకాదులును, కాలంజరపురవరాధీశ్వరుల మని కాలచుర్యులును, మహిస్మతీపురరాధీశ్వరుల మని హైహయులును చెప్పుకొన్నట్లుగానే యీక రాటచోడులును కోడూరుపురవరేశ్వరుల మని చెప్పు