పుట:Andhrula Charitramu Part 2.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయ్యది భావిపరిశోధనమ్నగాని స్థిరపడునది కాదు. ఇతనినే కాకతీయ రుద్రదేవనృపాలుడు జయించెను.

                     గోకర్ణనృపాలుడు
      భీమనసొదరుడైన గోకర్ణుడు వాగీంద్రచూడామణి యనుజైనసమ యాచర్యుని శిష్యుడు. వర్ధమానపురాధీశ్వరుండు. ఇతడు భీమకకవికి గర్తృత్వ మారోపింఅబదిన కవిజనాశ్రయ మనుచందోగ్రంధమున్ రచించి కళ్యాణపురా ధీశ్వరుం డైన ఛాళుక్యజగదేకమల్లునకు సేనాపతి యగు రేచభూపాలున కంకితము చేసెను. ఈరేచననికి గవిజనాశ్రల్యయు డనియు, గోకర్ణునకు శ్రావకాభరణాంకు డనియు బిరుదనామములు గలవు. కవిజనాశ్రయములో నాలుగాశ్వాసములునున జైనకావ్యధర్మముల ననుసరించి వగ్దేవతాస్తుతితో బ్రారంభింపబడినవి. వేములవాడభీమకవి రచించిన నృసింహపురాణముకాని కవిజనాశ్రయము కాదు. గోకర్ణుడనేకాగ్రహారములను బ్రాహ్మణోత్తములకు ధారవోసి శాసనములను వ్రాయించి యున్నాడు. ఈగోకర్ణుని గురు వయిన వాగీంద్రచూడామణీ తనపేరిటి లక్షణగ్రంధమును ఆదిపురాణమును ఆంధ్రభాషలో వివరించినటుల దెలియుచున్నది.
                        
                         భీముడు - గోకర్ణుడు.
     ప్రతాపరుద్రుజ్ని కాలమున వర్ధమానపురమును భీమచోడుడు తన సోదరు డైన గోకర్ణచోడినితో గలిసి పరిపాలనము సేయుచున్నటుల దెలియుచున్నది. ఈ భీమచోడనృపాలుడు పరమదుర్మార్గుడైనటుల రుద్రదేవునిశాసనమున వాకొనబడియెను. భోజనకాలమునందు  తన సొదరుని జంపెను. తన సవతితల్లికి బతియయ్యెను. పశ్చిమచాళుక్య డనువిక్రమాదిత్యచక్రవర్తికుమా డను తైలపదేవుడు వర్ధమానపురమున కిరువదిమైళ్ల దూరమునందున్న కందూరున బరిపాలనము సేయుచుండి రుద్రదేవుని పరాక్రమమునకు వెఱచి మరణమునొందగా భీమచోడు డరాజ్యము నాక్రమించుకొని కొలదికాలము పరిపాలనముచేసి రుద్రదేవునితో వైరము