పుట:Andhrula Charitramu Part 2.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రసిద్ధి కెక్కినది. అక్బరుచక్రవర్తికాలమునందును, బహమీరాజులకాలము నందును బ్రఖ్యాతివహించియుందిన దని మహమ్మదీయ చరిత్రములవలన స్పష్టమగుచున్నది.1 అక్బరుకాలమునణ్ దీపట్టణమును చండు డనుగొండురాజు ప్రిపాలనము సేయుచుండెను. అచ్చటి ఉరాతనములై శిధిలము లయిన శిలా ప్రదేశములు మొదలగివానింజూచినన్ స్థానిక చరిత్రములను విన్నను మాన వంశజాలయిన రాజు లచ్చట పరిపాలనము చేసియుండిరని తేటాడగలదు. ఈమానజాతిశాఖవారని తొచుచున్నది. వారలు మాణీక్యదేవిపేరిట దుర్గను బూ జించుచుండిరి. భద్రపట్టణము బద్రావతి యని చెప్పంబడుచుండెను. ఈ భద్రావతి యొకప్పుడు దక్షిణకోసలమునకు రాజధానిగ నుండెను. ఇయ్య్దది వజ్రపురము నకు (Wairagrah) 30 మైళ్లదూరౌమున నున్నది. దీనినే యిప్పుడు భాండక్ అని చెప్పుచున్నారు.

       ఈ చక్రకూటరాజూలశాసనములు కొన్ని నాగలిపిలొ సంస్కృతమునను, మఱికొన్ని తెలుగునను వ్రాయబడినవి. చక్రకొట్యమండలమునడుమ నింగ్రావతీ మదొ ప్రవహించుచున్నది.  దీనికుత్తరభాగమున బుట్టిన శాసనములన్నియు సంస్కృతమున నాగరలిపిలో నుండుటచేతన్, ఇంద్రావతీనదికి దక్షిణభాగమున బుట్టీనశాసనములు తెలుగునం దుండుటచేతన్, ఉత్తరభాగమ్న గోండుభాష యును, దక్షిణభాగమున తెలుగుభాషయును వ్యవహరింపబడుచుండినట్లుగా నూహింపబడుచున్నవి. ఈ నాగరాజుల  తెలుగుశాసనము లింకను బెక్కులు ప్రకట్ంపబడియుండలేదు. ఈ మొదటిసోమేశ్వరుని కృష్ణపుర సంస్కృతశాసన ములు మాత్రము ప్రకటింపబడినవి.  ఈసోమేశ్వరునకు శాసన మహాదేవి, ధారణ మహదేవి యను నిరువురు రాణులు గలరు. ధారణమహీదేవి దానధర్మములను గూర్చిన శాసనములు రెండు కృష్ణజ్పురమునందు(Kuruspal) గానబడుచున్నవి. ఈగ్రామము ఇంద్రావతీనదికి బైకొక మైలుదూరములో

1.Aini Akbari; Garret's Edition Vol.III, PP.229 Ind. Ant Vol.XXVIII P.21896