పుట:Andhrula Charitramu Part 2.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నున్నది. ఇప్పటి రాజధాని యగు జగదళపురమునకు 22 మైళ్లదూరమున నున్నది. నారాయణపురమును తమిరపట్టణమును కృష్ణపురమునక్ సామీప్య ముననే యున్నది. సోమేశ్వరుని రెండవరాణి యగు ధారణమహాదేవి కృష్ణపురములోని శ్రీకామేశ్వరస్వామికి బెక్కుభూదానములను జెసి శాసనము లను వ్రాయించెను. అందు విశేషచరిత్రాంశము లేమియున్ లేవుగాని, రైతులు మొదలగువారి నామములును సొమేశ్వరుని బిరుదావళులుపెక్కులును పేర్కొన బడినవి. ఇతడు మహేశ్వరపాదారాధనుడనియు, మాణిక్యదేవి పాదారాధకు డనియు జెప్పబడియుండుటచేత నీతడు శైవుడు శాక్తేయుడుననుటకు లేశ మాత్రమును సందియము లేదు. ఇతనికినుపకిదేవి యను తోబుట్టువు కలదు.

                 క న్న ర దే వ మ హా రా జు.
      మొదటిసోమేశ్వరునకు బిమ్మట వాని పుత్రుడు కన్హారదేవుడు రాజ్యూ భారమును వహించెను. శా.శ. 1043 ఖరసంవత్సర మనంగా క్రీ.శ. 1111-12 వ సంవత్సమున వ్రాయబడిన నారాయణపుర (Narayanapal) శాసనములోహి వాక్యసముదాయమునుబట్టి యాసంవత్సరముననే మహారజాధిరా జయిన సొమేశ్వరుడు మరణము నొందగా నాతని కొడుకు కన్హారదేవమహారాజు సింహాసన మెక్కెనని తేటపడుచున్నది.  మఱి రెందు శిధిలములయిన శాసనములను కన్నరదేవునినామముగానంబడుచున్నది గాని యాశాసనములకాలము చెప్ప బడనందున నాతనికి నెకన్నరదేవునకు గల సంబంధము దెలియరాకున్నది. భావి పరిశోధనముల వలనగాని వారిరువు రొక్కరగుదురో కారో చెప్ప వలనుగాదు. ఈకన్నరదేవమహారాజునుగూర్చిన చరిత్రాంశము లెవియును దెలియరాకున్నవి.
                 జగదేకభూషణవీరసోమేశ్వరమహారాజు
    కన్నరదేవమహారాజునకు బిమ్మట నెవ్వరు సింహాసన మధిష్ఠించిరో చరిత్రమున గోచరము గాకయున్నది. అయినను జాలకాలమ్నకు జగదేక భూషణవీరసోమేశ్వరమహారాజు శాసనములు గానిపించుచున్నందున భావిపరి