పుట:Andhrula Charitramu Part 2.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యనునది వస్తర రాజ్యముగుండ ప్రవహించి గోదావరిలో కలియుచున్నది. ఇంద్రనది యనిగూడ దీనికి బేరుగలదు. చిత్రకూటము రామాయణములో జెప్పబడిన చిత్రకూటాద్రికాదు. ఈచిత్రకూటము పురాణప్రసిద్ధమయినదిగనదిగద గూడ గనట్టుచున్నది. శిశునాగవంశములో జనించిన నందరాజులలో గడపటి వాడగు మహాపద్మనందుడు మగధదేశమున్ పరిపాలించుకాలమున నీ చిత్రకూట రాజ్యమును మందనాధు డనువాడును, ఆంధ్రరాజ్యమును కాకులు డను వాడును పాలనము సేయుచుండిరనియు వీరలును మఱికొందఱు రాజులును గలిసి మహాపద్మనందునితో యుద్ధము చేసి యోడిపోయి చెఱబెట్టబడితరాదిగ నారాజులెల్లరును క్షత్రియోచితసంస్కారముమలకునెల్ల వెలియై శూద్రప్రాయులై పోయిరనియు మార్కండేయాదిపురాణములయందు జెప్పబడియెను. ఆఱవ శాసనములందు చక్రకోట్యము సక్కరకొట్ట మని వ్రాయబడినది. ఇప్పటి బస్తర రాజ్యము మధ్యమాగాణములలోనిది. గోదావరి జిల్లాకు బశ్చిమోత్తరమునను విశాఖపట్టణములోని జయపురసంస్థానముననకు బశ్చిమమునను నున్న గోండ్వానాదేశములో నున్నది. అనగా చిత్రకూటరాజ్యము దక్షిణకోసల చేదిరాష్త్రములకుని కళింగాంధ్రదేశములకును నడుమనున్నది. దీని కిప్పటి రాజధాని జగదళపురము. కాకతీయప్రతాపరుద్రుని తమ్ముడగు అన్నమదేవుని సంతతివ రిప్పు డీదేసశమును పరిపాలించుచున్నారు.

                          జగదేకభూషణధారావర్షమహారాజు
    ఆంధ్రభారత కృతిపతియైన రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రపురము రాజధానిగా వేంగీరాష్ట్రమును బరిపాలించుచుందినకాలమున బదునొకండవశతాబ్దమధ్యమున జగదేకభూషణధారావర్షమహారాజు చక్రకొట్యు మండలమును బాలించుచుండెను.  రాజరాజనరేంద్రుని పుత్రుడును యువరాజును నగు రాజేంద్రచోడుడు చక్రకొట్యముపై దండెత్తివచ్చి యాపట్టణ మును ముట్టడించి యీధారావర్షునితో యుద్ధముచేసి జయించి యితనివలన గప్పము గైకొని దక్షిణకోసలములోని వాయిరానగరమును (వజ్రాకరము)