పుట:Andhrula Charitramu Part 2.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధనుర్విద్యయందు గశలు లగుటంజేసి ప్రాచీనకాలంబునవి, గొన్ని బులకు వారిపేరిట నాగాస్త్రం బనియు, గరుడాస్త్రం బనియు పెట్టబడి నవి. ఇవ్విషయంబు లటులుండనిండు. అయోధ్యానగస్రమునుండి శ్రీరామచంద్రుండు దండకరణ్యమార్గమున బంచవటికి వచ్చి సీతను గోల్పోయి లక్షణసమేతుండై కిష్కిందారాజ్యమునకు బోయి సుగ్రీవునితో సఖ్యముచేసికొన్నప్పుడు సీతను వెదకుటకై సుగ్రీవుడు హనుమదాదులరగులపట్టణ మగుబోగవతీపురంబునకు బంపె నని రామాయణమునందు జెప్పబడినది. హనుమంతునికి సీతయున్న ప్రదేశమును జెప్పిన పంపాతియు, సీతనుగొనిపోవునపుడు రావణున కడ్డుపడి యుద్ధముచేసి చనిపోయిన పంపావతితమ్ముడు జటాయువును, గరుడజాతిలోనివారే యైనున్నారు. ఆకాలమునందు వాసుకి యనునాగరాజుచే బరిపాలింపబడుచున్న భోగవతీపురమిప్పటి బస్తర(బస్తరు)రాజ్యములోని ప్రాగ్భాగమున నున్నట్లుగ గాన్పించుచున్నది. అట్టి వస్తరరాజ్యముయొక్క పదునెకడవ, పండ్రెండవ, పదమూడవ శతాబ్దముల చరిత్రమునే సంగ్రహముగా నీప్రకరణమున దెలుపబోవుచున్నాడను. ఆకాలమునం దీప్రదేశము చక్రకొట్య మండల మను పేర బరగుచుండేను. ఆంధ్రభారతకృతిపతి యైన రాజరాజ నరేంద్రునకును, అతనికుమారుండైన రాజేంద్రచోడుడను నామాంతరముగల మొదటి కులోత్తుంగచోడచక్రవర్తికిని సమకాలికు డై ధారావర్షు డనునాగరాజాకాలమ్న నీచక్రకొట్యమండలమ్ను స్వతంత్రుడై పరిపాలనము చేయుచుండెను.

                     చక్రకొట్యమండలము
     ఈచక్రకొట్యమడలమునకు రాజధాని చక్రకోట్య్హమే.  ఈపట్టణమునుబట్టి దేశమునకు నీనామమే గలిగినది. చక్రకొట్యమే చక్రకూటమని శాసనముల యందు వాడబడుచు వచ్చినది.  చక్రకూట మనునది చిత్రకూటముయెక్క తప్పునేరని తోచెడిది. చిత్రకూట మనుగ్రామ మొకటి యిప్పటి వస్తర (Bastar)  రాజూములోని యింద్రావతి నదియొడ్దున నున్నది.  ఇంద్రావతి