పుట:Andhrula Charitramu Part 2.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టరంగయ్య పంతులు బి.ఏ., బి.ఎల్., గారు పంపిన యభిప్రాయమును మాత్రమీ క్రింద నుదాహరించుచున్నాను. "విజ్ఞానచంద్రికామాలియక యందు తాము చేర్చిన నాయకమణిగా నొప్పెడి యాంధ్రులచరిత్రము జదివితిని. మీ విమర్శ విస్తృతియు, పరిశీలనానైపుణ్యమును కడు శ్లాఘనీయములుగనున్నవి. తెలుగుబాస నిదివరకు ప్రాయశః సాహిత్యమూలము లగు కావ్యములును కాదాచిత్కముగ వైద్యముననొండె ధర్మవిషయమున నొండె రాజవంశచరిత్ర ప్రస్తుతి మెండె గ్రంథములుండినవి కాని భాషాంతరాపేక్ష లేక మన యూర మన యింట గూర్చుని మన మాతృభాషలో సకల శాస్త్రేతిహాసాది విషయపరిచయముం బొందగలిగిన యవకాశము యుష్మదాదులగు దేశికుల మూలమున నాంధ్రప్రపపంచమునకు సమకూడుచున్నది`` ఈ రీతిగా బరిచయములేని విద్యాధికులనేకులు నా చరిత్ర గ్రంథమును చదివి నేను కోరియుండకపోయినను నాకు తెలియజేసినందులకు నా కృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను. ఇట్లు దొరతనము వారి శాసనపరిశోధకులు, ఇతర విద్యాధికులు, ఆంధ్రపత్రికాధిపతులు సదభిప్రాయములొసంగియుండుటచేత నాంధ్రపత్రిక 2వ యుగాది సంచికయందు శ్రీజయంతి రామయ్యపంతులుగారు వ్రాసిన వాక్యములకు, వారి భావములకు నిరుత్సాహపడవలసిన పని లేదని యెంచి యీ ద్వితీయచరిత్రభాగ రచనకు గడంగ సాహసించితిని. ఆంధ్రదేశము పూర్వ