పుట:Andhrula Charitramu Part 2.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

the Hon'ble Mr.N.Subba Rao Pantulu. I had come to judge of your beautiful style, correctness of statements and laborious research as being eminently fixed for the sort of work that you have undertaken to do”

(మాననీయులైన ఎన్.(న్యాపతి) సుబ్బరావుపంతులు గారి వలన మీ యాంధ్రులచరిత్రము యొక్క ప్రతి యొకటి పరిశీలనార్థము నా కొసంగబడినందున మీయొక్క చక్కనిశైలియు, యదార్థకథనమును, విశేషపరిశ్రమతోడి పరిశోధనయు చూడ మీరు పూనినటువంటి పనిని నిర్వహించుటకు మీరు మిక్కిలి తగియున్నారని తలంచియే యుంటిని) కృష్ణశాస్త్రిగారితో నాకు పరిచయము లేకపోయినను, ఆంధ్రులచరిత్రముయొక్క ప్రతిని వారికి పంపకపోయిన దోషము నాయందున్నను, నేను కోరియుండకపోయినను నా గ్రంథమును జదివిన మీదట వారికి కలిగిన యభిప్రాయమును ఆదరపురస్సరముగా దెలిపినందుకు వారికి నా కృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను.

ఇతర విద్యాధికులయభిప్రాయములు.

ఇతర విద్యాధికులనేకులనుకూలాభిప్రాయము లొసంగి యనేక విధములుగా బ్రోత్సాహమును గలుగజేసియున్నారు. వానినన్నిటిని గ్రంధవిస్తరణభీతిచే నిందుదాహరించుటమాని నెల్లూరులో న్యాయవాదులుగా నున్న శ్రీయుత వంగోలు వేంక