పుట:Andhrula Charitramu Part 2.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లనుగూర్చిన మార్పులు పండ్రెండవ శతాబ్దాంతము వఱకు జరిగియుండలేదని దక్షిణ హిందూస్థాన ప్రాచీనలిపి శాస్త్రమును రచియించిన బర్నెల్ దొరగారు వ్రాసి యున్నారు. కాబట్టి యాకాలమునకు దరువాతనే యధర్వణాచార్యుడుండెనని మన మూహింపవచ్చును. అథర్వణాచార్యుడు కొంచెమించుగా దిక్కనసోమయాజి కాలమువాడై యుండవలయును. ఇతడు మహాభారతమును విరాటపర్వము మొదలుకొనియే ప్రారంభించినట్లుగ గానంబడుచున్నది. ఆంధ్రశబ్దచింతామణిలో లేని లక్షణములు బెక్కింటిని అధర్వణాచార్యుడు వికృతివివేకములో జెప్పియున్నాడు. ఈకవి రచించిన తెలుగు భారతమిప్పటికి బ్రకటింపబడలేదు గాని యందలి పద్యము లనేకములు లక్షణ గ్రంథములలో బ్రకటింపబడియున్నవి. ఈ కవి వంశచరిత్ర దెలియరాదు. ఇతడు జైనుడని కొందఱు తలంచుచున్నారు. లక్షణ గ్రంథములలో నుదాహరింపబడిన పద్యములనుబట్టి చూడగా నితడు విరాటోద్యోగభీష్మ పర్వములను రచించినట్టును, కవిత్వము సంస్కృత పద బహుళముగా నుండి రసవంతమైయుండు ననియు రావుబహదరు వీరేశలింగము పంతులుగారి తమ కవుల చరిత్రమునం దెలిపియున్నారు.

గీ. "ధర్మతనయ యుష్మదాజ్ఞానిగళవిని
బద్ధమగుచు జిక్కువడియె గాక
విజయమత్తగజము విడివడ్డచో వడ్డ
పాటు గలదె విష్టపత్రయమున

క. శ్రీకంఠు దెదురునపుడు వ
నౌకోధ్వజ మింద్రమకుట మర్జునతురుగా
నీకము దివ్యకతాంగము
నా కవ్వడికబ్బియున్న నతం దేమగుమో

క. ఆకర్ణు దురాలాపము
లాకర్ణింపగ నసహ్యమై ద్రోణునితో