పుట:Andhrula Charitramu Part 2.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరతత్త్వస్తుతి యైనటుల నీక్రిందిపద్యము వేనోళ్ళ జాటుచున్నది.


"ఉ. శ్రీయన గౌరినా జెలగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగు రూపముగాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వముగొల్చెద నిష్టసిద్ధికిన్."

ఇతడద్వైతియనియు, ఏకేశ్వరోపాసకుడనియు, స్పష్టముగా బోధపడుచున్నది. గావున నీపరతత్త్వవేది కృష్ణభక్తుడై కృష్ణశతకమును జెప్పినాడనుట యుక్తియుక్తముగ లేదు.

తిక్కన వంశమువారు

తిక్కన కొమరాుడైన కొమ్మనవంశమువారు నెల్లూరు మండలములో బెక్కండ్రు గలరట. ఇదియే వాస్తవమైనయెడల దిక్కనవంశము తామరతంపరయై వర్ధిల్లుచున్నది గాని యీ వంశములం దిక్కన కీవల నొక్కకవియైన బుట్టకుండుటమాత్రము మిక్కిలి వింతగా దోపకమానదు. కొట్టురువు వంశము వారు పాటూరు వారయినారట.

అథర్వణాచార్యుడు

ఇతడు త్రిలింగశబ్దానుశాసనమును, వికృతివివేకమను వ్యాకరణకారికావళిని, అధర్వణచ్ఛందమును, భారతమును వ్రాసి ప్రసిద్ధి గాంచిన యొక మహాకవి. పై వానిలో ద్రిలింగశబ్దానుశాసనము వ్రాసినదు మఱియొక యధర్వుణుడనియు, అతడు నన్నయభట్టారకునకు మిక్కిలి ప్రాచీనుడునియు గొందఱు పండితులు తలంచుచున్నారు. అయునను హేమచంద్రునినామ మాగ్రంధమున బేర్కొనంబడియుండుట వలన నది యంత విశ్వాసపాత్రమైన వాదముగా దలంపరాదు. అయినను, హేమచంద్రులు గూడ మెకరిద్దఱికన్న నెక్కువగ నుండవచ్చును. త్రిలింగశబ్దానుశాసనము వ్రాసిన యథర్వణుడు వేఱయిన గాకపోయినను వికృతివివేక మను వ్యాకరణకారికావళిని వ్రాసిన వాడు పండ్రెండవ శతాబ్దాంతమున గాని, పదుమూడవ శతాబ్దాదాని గాని యున్నట్టు మనము నిశ్చయింపవచ్చును. అథర్వణకారికలలో జెప్పబడిన తెలుగక్కరము