పుట:Andhrula Charitramu Part-1.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వింధ్యమును బాదాగ్రతములచే ద్రొక్కి పట్టి గర్వాపహరణము గావించి మరల సూర్యరస్మిని బ్రసరింపగ జేసి లోకమునుద్ధరించెనని పురాణములయందభివర్ణింపబడియెను. ఆర్యులలో మొదట నగస్త్యుడే వింధ్యపర్వతమును దాటి దక్షిణమునకు వచ్చినవాడని పైపురాణగాథను బట్టి స్పష్టమగుచున్నది. వింధ్యపర్వతము యొక్క పశ్చిమోత్తరభాగమునకు బారియాత్రమను పేరుగలదు. ఇచ్చటనే వేత్రపతి మొదలగు నదులు జనించి యున్నవి. ఆర్యులు దక్షిణయాత్రకు బయలుదేరి యీపర్వత పంక్తి పార్శ్వమునకే పోయియుండుత చేత దీనికి బారియంత్రమని పేరువచ్చి యుండునేమోనని భాండార్ కర్ గారూహించియున్నారు.

అగస్త్యుడు వింధ్యము కడవరకు దూర్పుగాబోయి గోదావరికి సమీపమున నొకయాశ్రమము నిర్మించుకొని యుండెను. శ్రీరాముడీయాశ్రమమునకు వచ్చినట్లు రామాయణమునందు చెప్పబడి యుండుటచేత యిప్పటికే యీదండకారణ్యమునం బ్రవేశించి యార్యులాశ్రమాదుల నెలకొల్పుచుండిరని ధ్రువబడుచున్నది. ఈ యగస్త్యాశ్రమము ప్రస్తుతపు గోదావరి మండలములోని భద్రాచలమునకు సమీపమున నుత్తరదేశమున్నదని రెండవ ప్రకరణమున నుదహరించియుంటిమి. మొట్టమొదట నార్యులు దక్షిణాపథమున ద్రొక్కినప్రదేశ మాంధ్రభూమిగానే గన్పట్టుచున్నను. కొందరార్యులు కొంకణదేశమునకును బోయినట్లు కూడా గన్పట్టుచున్నది.

కర్ణాటార్యులు.

కడపట నీ యాంధ్రదేశమునకు వచ్చినవారు కర్నాటకార్యులు. కర్ణమనగా కొండలోయ. వానియందు సంచరించు వారు కర్ణాటకార్యులని చెప్పబడుచున్నవారు. కొందరుద్రావిడులు దక్షిణదేశమున నుండి పశ్చిమోత్తరమునకు గ్రమముగా వ్యాపించి మలయపర్వత ప్రాంతములందున్న లోయలలో నివసించు మనుష్యులతో గలసి తమ ద్రావిడమును లోవలోని వారి స్వభాషయగు కన్నడము జేర్చి కొంతకాలమువరకు వాడుకొనుచుండగా నుత్తరదేశము నుండి కొం