పూసా, పాలికాట్"అనువర్తకులిరువురు తమసరకులను అడ్జిటా రేవున దింపుకొని మగధ దేశములోని సువర్ణపురికి బోయిరని చెప్పబడినది. [1] కళింగదేశము లోని రెండవరేవు పట్టణము పేరు తెలియరాదు. కృష్ణానదీ ముఖద్వారమునందొక రేవు పట్టణ ముండినట్లనేక గాథలవలన దెలియుచున్నది. కొన్ని గాథలనైదవ ప్రకరణమున దెలిపియే యుంటిమి. ఈ పట్టణము పేరేమియని గ్రంథములను బరిశోధింపగ విదేశస్థులు వ్రాసిన గ్రంథములలో "మసాలియా" యని పేర్కొనబడియెను. టాలెమియను చరిత్రకారుడు, తన భూగోళమునందు మైసాలియా యని పేర్కొనియున్నాడు. ఈ గ్రంథకర్తలిరువురు రెండవశతాబ్దములోని వారుగా నున్నారు. ఈ పట్టణములపేరుతోనే మండలమునుగూడ వాడియున్నారు. [2]. మసాలియా యనగా మోసలపురమని యొకరు వ్రాసియున్నారు. ఈ మోసల లేక మోసలపురము కృష్ణా మండలములోని మసూలాయను మచిలీపట్టణమునకో లేక యరువది డెబ్బది మైళ్ల దిగువన గుంటూరు మండలము బాపట్ల తాలూకాలోని మోటుపల్లి గ్రామమునకో సంబంధించి యుండునని తోచుచున్నది. ఈ మండలము రవిసెల్లాలకు (సన్నని నూలు బట్టలకు) విఖ్యాతి గాంచిన దని పై గ్రంథకారులు పేర్కొనియున్నారు. ఇటీవలి చరిత్రకారులు వ్రాసిన విషయములను బట్టికూడ నీ యంశము ధ్రువపడుచున్నది. పదునొకండవ శతాబ్ద ప్రారంభమున "అబూరహాన్" అను అరాబియే దేశస్థుడొకడు "దనక" యను దేశము కొంకణమను పేరుగల కృష్ణానదీ తీరము నందలి పల్లపు ప్రదేశములలో నున్నదని పేర్కొనియున్నాడు. అబూరిహాను
పుట:Andhrula Charitramu Part-1.pdf/228
Appearance