ఈ పుట ఆమోదించబడ్డది
అజంటాలో నాలుగు చైత్యములుగలవు. తరువాతి కాలమున నిర్మింపబడిన చైత్యములలో బుద్ధునిరూపపటములుగాను పించుచున్నవి. ఈ కడపటి చైత్యము లలో నిరూపింపబడిన బౌద్ధమతమారవ శతాబ్ధములోని హిందూమతమును సమీపించియున్నది. అజంటావిహారములలో నొకదానిపటమీ క్రింద జూపుచున్నారము. ఇది మిక్కిలి సొగసుగానుండునది. ఈ విహారము 94 అడుగుల పరిమాణము గలిగి 24 స్థంభములతో నొప్పాఱుచున్నది.
అజంటావిహారములో శిల్ప చాతుర్యము.
బౌద్ధ భిక్షువులు నివసించుటకై రెండు ప్రక్కలను 16 గదులు గలవు. నడుమ నొక్క గొప్పచావడియు ముంగటనొకవసారయు వెనుక పవిత్రమైన గర్భగృ