పుట:Andhrula Charitramu Part-1.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్రముంగూర్చి సద్గ్రంథములు పుట్టగలవని నాదృఢమైన విశ్వాసము.

విజ్ఞానచంద్రికా మండలికి గృతజ్ఞత.

అట్టి ధృఢమైనవిశ్వాసముతో నేనీ గ్రంథరచనకుం బూనుకొని పాటుపడుచుంటినిగాని యిది బహువ్యయ ప్రయాసములతో గూడిన దగుటంజేసి యితరుల సాహయ్యమపేక్షించినగాని యిది నెరవేరదని కొందరి మిత్రులతో బ్రస్తావించగా నొక మిత్రుడు దీని హక్కును దనకిచ్చి వేసినయెడల దనకుందోచిన ప్రతిఫలమిచ్చెద ననియెను. దేశభాషాభివృద్ధికై యేర్పడిన యొక సంఘములోని యొక మిత్రుడు గ్రంథము వ్రాసి తెచ్చిన యెడల దరువాత మాట్లాడవచ్చునని చెప్పెను. ఇంకొక మిత్రుడు గ్రంథము వ్రాసియిచ్చిన యెడల దాముప్రకటించి గ్రంథ విక్రయమువలన వచ్చిన సొమ్మలో దమకయిన ముద్రాభృతి మొదలగు వ్యయమును మొదటదీసివేసి యేమైన మిగిలినయెడల జెరిసగము పాలుగొందమని చెప్పిరి. ఈ గ్రంథరచనయందలి కష్టము వారెరింగి యుండకపోవుటచేతను, మనభాషా గ్రంథములయందు మనవారికుండు నలక్ష్యస్వభావము చేతను నా మిత్రు లట్లు చెప్పిరిగాని వారికి నాయెడంగల దుర్భావము చేత గాదని నేనెరుంగుదును. అయినను దమకుదామ తోడ్పడు వారికి దైవమును దోడ్పడునని స్మైల్స్ అను గ్రంథకర్తచెప్పిన వాక్యమును స్మరణకు దెచ్చుకొని నిరుత్సాహుడును గాక యొరులవలన సాహాయ్యమపేక్షింపరాదని దృఢమనస్కుడనై యొక్కొక్క రాజవంశమును గైకొని చిన్న చిన్న భాగములుగా జరిత్రమంతయు బ్రకటింప నిశ్చయించుకొని యన్ని పనులను మానుకొని చెన్నపురికి వచ్చి