Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధారముగా గొని యొకవిధముగా దేశచరిత్రమున కనుకూలములగు విషయములను వ్రాసిరి. వీనినన్నిటిని దొరతనము వారును పాశ్చాత్యపండిత సంఘముల వారును బ్రకటించి యుండిరి. ఈ గ్రంథములన్నిటిని సేకరించి దొరతనమువారు తమచే స్థాపింపబడిన పుస్తక భాండాగారములయందు బెట్టియున్నారు. అట్టివి రెండు పుస్తక భాండాగారములు చెన్నపురియందు బ్రజల యుపయోగార్థము స్థాపింపబడి యున్నవి. అందొకటి క్యాన్నిమరా లైబ్రరీ యనుపేరను (Cannemera Library) మరియొకటి ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమను పేరను (Oriental Manuscript Library) బరగుచు జెన్నపురి వివిధవస్తు ప్రదర్శనశాలా భవనమున (Museum) నెలకొల్పబడియున్నవి. పురాతన చరిత్రములను మరియే గ్రంథములనైన వ్రాయబడిన పుస్తకభాండాగారములు మిక్కిలి యుపయోగకరములుగా యుండకమానవు. పాశ్చాత్యపండితు లవలంబించిన మార్గము సరియైనదైనను, సత్యాన్వేషణపరులై మిక్కిలి నైపుణ్యముతోడను గూడ బనిచేసియున్నను వారు విదేశస్థులగుటవలన గొన్ని విషయములు మనకు దెలిసినంత చక్కగా వారికి తెలియరావు. గావున వారును గొన్ని తావుల బ్రమాదముల పాలగుచు వచ్చిరి. కాబట్టి వారును వ్రాసినదంతయును సత్యమైన చారిత్రము కాజాలదు. కాని వారుచూపినత్రోవనే మనంమునుబోయి వారు దూషించినంత "అబద్ధపుకూత" లనుగా మనగ్రంథములను ద్రోసివేయక యెంతవరకు దేశచరిత్రములకు దోడ్పడగలవో యంతవరకే గ్రహించి మనము విశేష పరిశ్రమజేసి దేశచరిత్రములను వ్రాయుటకు మొదలుపెట్టినచో గొంతవరకు జరి